బ్రేకింగ్: సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ గేయ రచయిత కన్నుమూత..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ నుండి వరుసపెట్టి విషాద వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరు మరణ వార్త విని ఆ బాధ నుండి తెరుకోకముందే మరో మరణ వార్త వింటూ సినీ ఇండస్ట్రీ పెద్దలు శోకశంద్ర లో మునిగిపోతున్నారు. ఇప్పటికే మాయదారి మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది బడా బడా సినీ ప్రముఖులు మరణించడం మన చూశాం. మరి కొందరు అనారోగ్య కారణాలతో తిరిగిరాని లోకాలకు వెళ్లడం సినీ ప్రియులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో మరణ వార్త సినీ లోకంలో విషాదం నింపింది.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి కన్నుమూశారు. 49 సంవత్సరాలు గల ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ట్రీట్ మెంట్ తీసుకుంటున్న పరిస్ధితి విషమించడంతో శనివారం మృతి చెందిన్నట్లు డాక్టర్లు తెలిపారు. కందికొండ యాదగిరి స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి. మనసుకు హత్తుకుని పాటలు రాయడంలో ఈయనకు మించిన వారు లేరు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా పాటలు రాయడం ఆయన స్పెషాలిటీ.

ఉస్మానియా యూనివర్సిటి నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న ఈయన పలు హిట్ చిత్రాలకు కూడా పాటలను అందించడం విశేషం. మహేష్ బాబు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ట్లు సినిమాలో గలగల పారుతున్న గోదారిలా అనే పాట రాసి బడా బడా స్టార్స్ ప్రశంసలు అందుకున్నారు. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మళ్లీ కూయవే గువ్వా, చిన్నీ మా బతుకమ్మా చిన్నారక్క బతుకమ్మ పాటలను రాసింది ఆయనే ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంతటి టాలెంటెడ్ ఉన్న ట్లు ఇప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం అంటున్నారు సినీ పెద్దలు. ఆయన మృతితో సినీ ఇండస్ట్రీ శోకశంద్రంలో మునిగిపోయింది. ఈయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన లేని లోటు ఎవ్వరు తీర్చ లేనిది అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు .

Share post:

Popular