బాలయ్య చిన్నల్లుడుకు ఆ సీటు ఫిక్స్..?

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..ఆ రెండు పార్టీలు పొత్తుపై చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే…అయితే అధికారికంగా రెండు పార్టీల పొత్తు మాత్రం సెట్ కాలేదు..ఎన్నికల ముందు ఏమన్నా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పొత్తుని దృష్టిలో పెట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబు..టీడీపీ నేతల సీట్లు ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవల చంద్రబాబు అసెంబ్లీ స్థానాల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశమై…అభ్యర్ధులని ఫిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటినుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులని ఖరారు చేసేస్తున్నారు. ఇదే క్రమంలో కొన్ని సీట్లలో చంద్రబాబు డమ్మీ ఇంచార్జ్‌లని పెడుతున్నారు..అవి కూడా జనసేనకు కాస్త బలం ఉన్న సీట్లలోనే…అంటే ఒకవేళ పొత్తు ఉంటే ఆ సీట్లని జనసేనకు కేటాయించడం కోసమే బాబు…టీడీపీ అభ్యర్ధులని ఫిక్స్ చేయడం లేదని తెలుస్తోంది. అలాగే కొన్ని పార్లమెంట్ సీట్లని కూడా జనసేనకు ఇవ్వాల్సి వస్తుందనే సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో విశాఖ పార్లమెంట్ సీటుని పొత్తు ఉంటే జనసేనకు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది..2014లో పొత్తులో భాగంగా ఆ సీటుని బీజేపీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఇక 2019 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకపోవడంతో డైరక్ట్‌గా టీడీపీ పోటీ చేసింది..టీడీపీ నుంచి బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ పోటీ చేసి కేవలం 4 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు…ఓడిపోయాక కూడా భరత్ విశాఖలో పార్టీ కోసం పనిచేస్తున్నారు..మళ్ళీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.

అయితే పొత్తులో భాగంగా విశాఖ సీటు జనసేనకు కేటాయిస్తే భరత్‌కు ఛాన్స్ ఉండదు. కాకపోతే పొత్తు ఉన్నా సరే విశాఖ సీటుని జనసేనకు ఇవ్వరని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సారి భరత్‌కు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జనసేనకు పక్కనే ఉన్న అనకాపల్లి సీటు ఇచ్చి, విశాఖలో మాత్రం టీడీపీనే పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Share post:

Popular