వావ్ తార‌క్ కామెడీ టైమింగ్‌తో చంపేస్తున్నాడే…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన మ‌రో విజువ‌ల్ వండ‌ర్ త్రిబుల్ ఆర్‌. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ నెల 25న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్లు మామూలుగా జ‌ర‌గ‌డం లేదు. త్రిబుల్ ఆర్ అంటే రౌద్రం ర‌ణం రుధిరం ట్యాగ్ లైన్‌తో వ‌స్తోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్లు నెక్ట్స్ లెవ‌ల్లోనే ఉంటున్నాయి.

ఇక ఈ ప్ర‌మోష‌న్ల‌లో చ‌ర‌ణ్ ఎప్ప‌టిలాగానే సైలెంట్‌గా ఉంటోన్నాడు. రాజ‌మౌళి అప్పుడ‌ప్పుడు నోరు మెదుపుతున్నాడు. తార‌క్ మాత్రం ఎప్ప‌టిలాగానే త‌న ఎన‌ర్జిటిక్ పెర్పామెన్స్‌తో చంపేస్తున్నాడు. ఓవ‌రాల్ ఇంట‌ర్వ్యూలో మెయిన్ లీడ్ తీసుకుని తానే మొత్తం మాట్లాడేస్తున్నాడు. తార‌క్ ఎన‌ర్జీ వ‌ల్లే ఆ ఇంట‌ర్వ్యూలు కూడా ఓ రేంజ్‌లో హైలెట్ అవుతున్నాయి.

నిన్న బిగ్‌బాస్ హౌస్ త‌ర‌హాలో రాజ‌మౌళి, తార‌క్‌, చ‌ర‌ణ్ క‌లిసి ఓ ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూ రిలీజ్ చేశారు. ఈ ఇంట‌ర్వ్యూలో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు తారక్ టైమింగ్ మంచి హైలెట్ అయ్యింది. వీడియో స్టార్టింగ్‌లోనే రాజ‌మౌళిని, కార్తీకేయ‌ను ఆడుకోవ‌డం.. త‌ర్వాత చ‌ర‌ణ్ తార‌క్‌కు కాపీ పెడ‌తాను అని అంటే.. నీ చేత్తో విషం పెట్టినా తాగేస్తా అన‌డం హైలెట్ అయ్యింది.

ఓవ‌రాల్‌గా చూస్తే తార‌క్ ప్ర‌మోష‌న్ల‌లో అంతా తాను అయ్యి హైలెట్ అవుతున్నాడు. చ‌ర‌ణ్ ఎప్ప‌టిలాగానే స్లోగా మూవ్ అవుతున్నాడు. ప్రస్తుతం పలు భారీ ఈవెంట్స్ ని ఇప్పుడు వీరు స్టార్ట్ చెయ్యగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఈ 25న విడుదల కానుంది.

Share post:

Latest