ఎన్టీఆర్ మనవరాలు.. ఉరివేసుకొని చనిపోవడం వెనుక ఉన్న స్టోరీ ఇదేనా?

నటసార్వభౌముడుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని ఖ్యాతి సంపాదించిన సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు అని చెప్పాలి. ఇక తిరుగులేని హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వందల సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం కూడా ఎంతో ఆసక్తి కరంగానే సాగిపోయింది. అయితే ఇక లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం ఎన్టీఆర్ జీవితం మొత్తం పూర్తిగా వివాదాలతోనే గడిచిపోయింది. ఆయన తుది శ్వాస విడిచే వరకూ కూడా ఇక సీనియర్ ఎన్టీఆర్ ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

అయితే సీనియర్ ఎన్టీఆర్ మరణం తర్వాత నందమూరి కుటుంబం గురించిన ఒక వార్త మాత్రం సంచలనంగా మారిపోయింది. ఏకంగా ఎన్టీఆర్ మనవరాలు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం తో సంచలనంగా మారింది. ఎన్టీఆర్ కొడుకు జయకృష్ణ కు ఒక కూతురు ఉంది. ఆమె పేరు కుముదిని. అల్లారుముద్దుగా పెంచిన తన కూతురును అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ఇచ్చి 1993లో వివాహం చేశారు.

కానీ ఆ తర్వాత మాత్రం అనూహ్య పరిణామాల నేపథ్యంలో కుముదిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక శ్రీనాథ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సంసారజీవితంలో కొన్నాళ్ల పాటు ఎంతో సంతోషంగా ఉంది. వీరికి ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. ఇక ఒకానొక సమయంలో వ్యాపారం కోసం కుముదిని ని వన్ మిలియన్ డాలర్లు కావాలంటూ అడిగాడట శ్రీనాథ్. దీంతో భర్త మీద కోపంతో కుముదిని ఇక భారత్ వచ్చేసింది.

వీరి మధ్య ఎన్నో గొడవలు జరిగి సద్దుమణిగిన తరువాత 1995 లో ఇక భర్త కోసం అమెరికా కి వెళ్ళింది. కానీ అప్పటికే భర్త వేరే ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవటం చూసిన కుముదిని మనస్థాపంతో మళ్ళీ ఇండియా వచ్చేసింది. పెద్ద చదువులు చదివిన కుముదిని ఇక పుట్టింటికి వెళ్లకుండా ఉద్యోగం చేసుకుంటూనే జీవనం సాగించింది. ఇక పూర్తిగా శ్రీనాథ్ భార్యకు తో సంబంధం తెచ్చుకోవడంతో మనస్థాపం చెంది చివరికి ఉరిపోసుకుంది. ఈ ఘటన అప్పట్లో టాలీవుడ్ లో సంచలనం గా మారిపోయింది.

Share post:

Popular