కృష్ణ – ఎన్టీఆర్ మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మైన సినిమా ఇదే..!

టాలీవుడ్ లో సీనియర్ నటులు అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ – సూపర్ స్టార్ కృష్ణ మధ్య సినిమా రంగంలోనూ.. ఇటు రాజకీయ రంగంలోనూ.. వ్యక్తిగతంగానూ విభేదాలు ఉండేవి అన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఇటీవల జరిగిన బాలయ్య టాక్ షోలో మహేష్‌బాబు అవేమీ లేవు అని క్లారిటీ ఇచ్చారు. అయితే వాస్తవంగా కొన్ని అంశాల్లో ఎన్టీఆర్‌తో పోటీ పడి మరీ కృష్ణను ఢీకొట్టే వారు. ఎన్టీఆర్ కు పోటీగా ఎన్నో సినిమాల్లో నటించి తన సినిమాలను రిలీజ్ చేయించేవారు. ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తానని ముందే ప్రకటించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ సైతం అదే రోజు అదే మహాభారత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన‌ కురుక్షేత్రం సినిమా తీసి దానవీరశూరకర్ణ రిలీజ్ అయిన ఈ రోజు రిలీజ్ చేయించారు.

ఇదిలా ఉంటే కృష్ణ – ఎన్టీఆర్ మధ్య అసలు గొడవకు కారణం ఏంటి ? అన్నదానిపై అప్పటి తరం సినిమా జర్నలిస్టులు అల్లూరి సీతారామరాజు సినిమా అని చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్ పౌరాణిక.. సాంఘిక , చారిత్రక సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఆయనకు అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలన్న కోరిక ఉండేది. క‌థ కూడా రెడీ చేసుకున్నారు. అయితే కొన్నేళ్ళ పాటు ఆ సినిమా చేయడం ఆయనకు కుదరలేదు. ఈలోగా కృష్ణ తన భార్య విజయనిర్మల దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు సినిమా చేసేశారు. పైగా ఆ సినిమా ప్రివ్యూ షోకు ఎన్టీఆర్ ను స్వయంగా పిలిచారు.

ఆ సినిమా చూసిన ఎన్టీఆర్ సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. సీతారామరాజు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా ఎన్టీఆర్ చేయాలనుకున్న సినిమా కృష్ణ‌ చేయడంతో వారిద్దరి మధ్య విభేదాలకు బీజం పడిందని అంటారు. అప్ప‌టికే ఎన్టీఆర్ క‌థ రెడీ చేసుకున్నారు అని తెలిసి కూడా కృష్ణ చేయ‌డం ఎన్టీఆర్‌కు కోపం తెప్పించింద‌ని టాక్ ? అయితే సీతారామరాజు పాత్ర చేయాలనుకున్నా ఎన్టీఆర్ కోరిక సర్దార్ పాపారాయుడు సినిమాలో నెరవేర్చుకున్నారు.

సీతారామరాజు మాత్రమే కాదు వేమన, వివేకానందస్వామి పాత్రలు కూడా చేయాలని ఎన్టీఆర్ కి మనసులో బలంగా కోరిక ఉండేదట. ఇవి కూడా నెరవేరకుండానే ఎన్టీఆర్ మృతి చెందారు. అలా సినిమాల్లో కొనసాగిన కృష్ణ – ఎన్టీఆర్ వైరం రాజకీయాల్లోనూ కొనసాగింది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీకి బద్ధశత్రువుగా ఉండే కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణ‌ ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. వారిద్దరి మధ్య సినిమాల్లో ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఆ వైరం అలా కొనసాగుతూనే వచ్చింది. అయితే ఎన్టీఆర్ 1994లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వీరిద్దరి మధ్య స్నేహం ఎప్పటిలాగానే కొనసాగింది.

Share post:

Latest