సినిమాకు RRR అని పేరు పెట్టడం వెనుక అసలు సీక్రేట్ అదే.. రాజ‌మౌళి ఓపెన్ గా చెప్పేశారుగా..!!

RRR..గత కొంత కాలంగా ఈ పేరు అందరి నోట నానిపోతుంది. ఎవ్వరు ఊహించని విధంగా రాజమౌళి మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించాలి అనుకోవడం..వాళ్ళ తండ్రి విజయేంద్రప్రసాద్ స్టోరీ చెప్పగానే మొదట కోలీవుడ్ హీరో రజీనికాంత్ తో ఈ సినిమాను తెరకెక్కించాలి అనుకున్నారట. ఆ తరువాత కోలీవుడ్ మెగా బ్రదర్స్ సూర్య-కార్తి లతో తెరకెక్కిదాం అనుకున్నా..ఎందుకో తెలియదు అది వర్క్ అవుట్ కాలేదు. దీంతో..ఈ కధ అటు ఇటు తిరుగుతూ..ఫైనల్ గా చరణ్-తారక్ లకు దక్కింది.

మరి కొద్ది గంటల్లోనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే UA,UAE దేశాలల్లో సినిమా టాక్ బయటకు వచ్చేసింది. ప్రతి ఒక్కరు సినిమా సూపర్ హిట్ అంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. కానీ అసలైన ఒరిజినల్ రివ్యూ రావాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. మరో వైపు రాజమౌళి సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ లోకి తీసుకెళ్తున్నారు. సినిమాకి ప్లస్ అయ్యే ఏ పాయింట్ ని మిస్ చేసుకోవడంలేదు. బడా బడా ప్రముఖులతో స్పెషల్ ఇంటర్వ్యులు అంటూ కని విని ఎరుగని ప్రమోషన్స్ ని RRR కోసం చేస్తున్నారు.

ఈ క్రమంలో నే ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..రాజమౌళి సినిమాకు RRR అనే పేరు ఎందుకు పెట్టామో వివరించారు. ఆయన మాట్లాడుతూ..”నిజానికి.. ఈ సినిమాకు మేము పేరు RRR అని అనుకోలేదు. అసలు మేము టైటిల్ గురించే ఆలోచించలేదు. పొడక్షన్స్ వర్క్ జరుగుతున్నప్పుడు..సరదాగా మాట్లాడుతూ..సినిమాకి ఒక పేరు ఉండాలి కదా.. టైటిల్ ని ఫిక్స్ చేసే లోపు ..RRR అని పిలుచుకుందాం అని అనుకున్నారట. కానీ, ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలైనప్పటి నుండి #RRR ట్రెండింగ్ అవుతుండటంతో .చరణ్-తారక్ కూడా RRR బాగుంది అనడంతో చిత్రానికి ఆ పేరునే ఫైనల్ చేశాం. సో..ఈ సినిమాకి పేరు పెట్టింది అభిమానులే” అంటూ ఫ్యాన్స్ మనసులని టచ్ చేశాడు జక్కన్న.

Share post:

Popular