‘ఆర్ఆర్ఆర్’నటి నటీమణులు ఫైనల్ రెమ్యూనరేషన్స్ లెక్కలు లిస్ట్ ఇవే !

స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో టాలీవుడ్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ .డివివి దానయ్య నిర్మాణం చేయగా ,ఈ చిత్రానికి దాదాపు 450 కోట్లు వ్యయం అయింది ,ఈ సినిమాకి లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు .సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు .

అసలు విషయం ఏమిటంటే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో నటించిన నటి నటుల రెమ్యూనరేషన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారో అనే విషయం ఇప్పుడు వైరల్గా మారింది.ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఒక్కొక్కరికి 45 కోట్ల చొప్పున రెమ్యునరేషన్‌గా అందినట్టు సమాచారం. అలాగే, ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్ దేవగణ్ 25 కోట్లు, అలియాభట్ 9 కోట్లవరకు అందుకున్నారట. ఇక చిత్ర దర్శకుడు రాజమౌళి రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా లాభాల్లో 30 శాతం వాటా తీసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు.అయితే ఈ సినిమాకోసం eఇక ఇప్పటికే అన్నీ కలుపుకొని దాదాపు 900 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25 న విడుదల అవుతుంది.

Share post:

Popular