వద్దన్నా వినకుండా స్టేజీ పైనే అసలు సీక్రేట్ చెప్పేసిన రానా..క్లాస్ పీకినా సూర్య..!!

సింహం సింహం హీ ఈజ్ నరసింహం..ఈ పాట వినగానే మనందరికి గుర్తు వచ్చేది..కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. కళ్లల్లో ఆ పవర్..చూపుల్లో ఆ కోపం..మాటల్లో నిజాయితి..ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో..ఉన్నాయి సూర్య గురించి. సూర్య ఒక గొప్ప నటుడే కాదు..మంచి భర్త..మంచి తండ్రి..అంతకు మించిన గొప్ప మనిషి. ఇప్పుడున్న సెలబ్రిటీలో చాలా మంది ఎవ్వరికైనా సహాయం చేస్తే మీడియాలో వచ్చే వరకు కూడా ఆగకుండా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా పబ్లిసిటీ చేసుకుంటుంటారు. కానీ సూర్య అలా కాదు నేను ఇచ్చే డబ్బు వాళ్లకి అవసరానికి ఉపయోగ పడిందా అనే చూస్తారు కానీ..నా ఫాలోయింగ్ పెరిగిందా అని చూడడు..అందుకే కాబోలు సూర్య కి కోట్లల్లో అభిమానులు ఉన్నారు.

వాళ్లల్లో మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఉన్నారు. సూర్య నటించిన సినిమాలు తమిళంలో పాటు తెలుగులోను డబ్ అవుతుంటాయి. ఈ క్రమంలో నే ఇక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు సూర్య. నిజం చెప్పాలంటే మన స్టార్ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈయనకు. అయితే..ఈయన తాజాగా నటించిన చిత్రం..‘ఈటీ’. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మార్చి 10న పాన్ ఇండియా లెవ‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ క్రమంలో గురువారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జ‌రిగింది.

ఈ కార్యక్ర‌మంలో హీరో సూర్య‌, స‌త్య‌రాజ్‌, చిత్ర ద‌ర్శ‌కుడు పాండిరాజ్ తో పాటు మన డానియల్ శేఖర్ కూడా పాల్గొన్నారు. ఇక దీంతో ఒక్కసారిగా హాల్ మొత్తం భీమ్లా నాయక్ అంటూ గట్టిగా కేకలు అరుపులతో హోరెత్తించారు. ఇక ఈ ఈవెంట్‌లో రానా మాట్లాడుతూ హీరో సూర్య గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేశాడు. ఓ వైపు సూర్య వద్దు వద్దు అంటున్నా వినకుండా బలవంతంగా మైక్ లాకుని సూర్యకి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ చెప్పేశారు. దీంతో సూర్య పేరు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

రానా మాట్లాడుతూ..”నేను మీలాగే సూర్యగారికి వీరాభిమాని. చాలా చాలా పెద్ద ఫ్యాన్ ని. శివ పుత్రుడు సినిమా చూసిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్‌ని. నిజం చెప్పాలంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఆయ‌న పేరు కూడా తెలియ‌దు. ఆ త‌ర్వాత కొన్ని నెలలకి నేనూ యాక్ట‌ర్ అయ్యాను. ఓసారి నా సినిమా ఎడిటింగ్ రూమ్‌లో ఆయ‌న చూశాను. దగ్గరకు వెళ్ళి పలకరించాను..ఆ త‌ర్వాత ఆయన న‌న్ను త‌న కారులో ఎక్కించుకుని నాలుగు గంట‌ల పాటు హైద‌రాబాద్‌లోని రోడ్ల‌ పై తిప్పాడు. ఇక ఆ టైంలో నే నాకు విలువైన సజీషన్స్ ఇచ్చారు. ” చూడు బాబు నువ్వు బాగానే నటిస్తున్నావు కానీ దానికి యాక్టింగ్ అనరు .. నువ్వు నటించడంలేదు మేనేజ్ చేసేస్తున్నావ్’ అంటూ ఫుల్ క్లాస్ పీకారు. ఇక అలా ఆరోజు ఆయ‌న నాకు పీకిన క్లాస్ వల్లనే నేను ఇప్పుడు మీ ముందుకు భ‌ళ్లాల‌దేవుడిగా .. డానియ‌ల్ శేఖ‌ర్‌గా నిల‌బ‌డిగ‌లిగాను..మీ అభిమానాని అందుకుంటున్నాను. దీనంతటికి కారణం సూర్య అంటూ చెప్పుకొచ్చారు రానా.

Share post:

Popular