బాలయ్యలో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసిన రానా..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా అది తక్కువగానే అనిపిస్తుంది. అది అంతే లెజండ్స్ గురించి ఎంత చెప్పినా .. ఎంత సేపు విన్నా..ఇంకా ఏదో చెప్పాలని..మరింత సేపు వినాలి అనిపిస్తుంటుంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు ముఖం మీదనే చెప్పే నటులు చాలా తక్కువ..అలాంటి వారిలో బాలయ్య ముందుంటాడు. ఎదుట ఉన్నది ఎంతటివాడైనా సరే..తప్పు చేస్తే ఒకటీ రెండు సార్లు చెప్పి చూస్తాడు..కానీ వాడు వినకుండా అదే తప్పు పదే పదే చేస్తే తాట తీసేస్తాడు. బాలయ్య దృష్టిలో తప్పు అందరు చేస్తారు..కానీ ఆ తప్పును తెలిసి సరిదిద్దుకున్న వాడే అసలైన మనిషి అని నమ్ముతుంటాడు.

బాలయ్యలో కోపమే కాదు..ప్రేమ కూడా ఎక్కువే. ఏదైనా కార్యక్రమంలో తన అభిమానులు బయట వెయిట్ చేస్తున్నారంటే .. వాళ్ల దాగ్గరకు వెళ్లి పలకరించి తన అభిమానులతో ఫోటోలు దిగుతాడు. వాళ్లు కాళ్ళకు దండం పెడుతున్నా..”వద్దు వద్దు..నేను అంత పెద్దవాడిని కాను..మీ స్దానం నా గుండెల్లో ఉంటుంది” అంటూ అభిమానులతో ప్రేమగా మాట్లాడుతాడు. కానీ కొందరు హీరోలు తమ అభిమానులని బాడి గార్డ్స్ చేత దూరం పెట్టించడం..పబ్లిక్ లోనే అరవడం మనం చాలా సార్లు చూశాం. అందుకే కాబోలు చాలా మంది ప్రజలు బాలయ్యను ఇష్టపడేది. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆయన చెప్పిన పనిని తు.చ.తప్పకుండా పాటిస్తారు.

బాలయ్యకు సామాన్య ప్రజలే కాదు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా బడా హీరోలు కూడా బాలకృష్ణ అంటే పడి చచ్చిపోతారు. వాళ్లల్లో ముఖ్యంగా హీరో నిఖిల్,రానా, నాని..వీళ్లు ఓపెన్ గానే మేము బాలయ్య అభిమానులం అంటూ చాలా ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గా రానా బాలయ్య గురించి ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భీమ్లా నాయక్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఓ ప్రముఖ పత్రికా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆయన మాట్లాడుతూ..”బాలకృష్ణ గారు..చాలా ఓపెన్ మైండ్. మనసులో ఏది అనిపిస్తే అది అనేస్తారు. చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. బాలయ్య గారిలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ అదే. ఓ హీరో గా కానివ్వండి..హోస్ట్ గా కానివ్వండి..బాలయ్య గారి ఎనర్జీ ముందు మిగత వాళ్లు సరిపోరు. ఆయనకు ఎలాంటి ఫిల్టర్స్ ఉండవని..అందుకే అన్స్టాపబుల్ షో అంత హిట్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. నా దృష్టిలో ఇండియాలోనే ది బెస్ట్ టాక్ షో “అన్స్టాపబుల్” అని, ది బెస్ట్ యాక్టర్ బాలయ్య గారు అని” బాలయ్య పై తనకు ఉన్న అభిమానాని తెలియజేసారు. ప్రస్తుతం రానా మాట్లాడిన మాటాలు నెట్టింట ట్రెండింగ్ ఉన్నాయి. ఇక అభిమానులు అయితే జై బాలయ్య అంటూ కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు.

Share post:

Popular