రాధే శ్యామ్ పబ్లిక్ టాక్: ఎవ్వరు ఊహించని క్లైమాక్స్..ఎంత షాకింగ్ అంటే..!!

ఇప్పుడు ఎక్కడ చూసిన “రాధే శ్యామ్” హవా నడుస్తుంది. ఫోన్ లో మెసేజ్లు, ఆటో-క్యాబ్ లో రాధే శ్యామ్ సినిమా పాటలు, లవర్స్ మధ్య మాట్లాడుకునే మాటల్లోను రాధే శ్యామ్ కబుర్లు..ఇక టీవీ పెట్టినా రాధే శ్యామ్ ప్రమోషన్లు..రాధే శ్యామ్..రాధే శ్యామ్..రాధే శ్యామ్..ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తున్నాయి. దీని బట్టి ప్రభాస్ సినిమా కోసం ఎంతో మంది ఇంతలా వెయిట్ చేస్తున్నారా అని అర్ధమైపోతుంది. కాగా..ఎప్పుడెప్పుడు ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ బొమ్మ తెర పై పడుతుందా అని ఆశగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. కోట్లాది మంది ఫ్యాన్స్ గత కొన్ని సంవత్సరాలుగా..ఈగర్ గా వెయిట్ చేసిన రాధే శ్యామ్ సినిమా కొద్ది గంటల క్రితమే ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

తెర పై ప్రభాస్ బొమ్మ పడగానే ధియేటర్స్ లో వచ్చే అరుపులు..విజిల్స్, కేకలు..ప్రభాస్ అభిమానుల ఆనందాని తెలియజేస్తున్నాయి. ప్రతి ఒక్క అభిమాని ఆ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. “ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఇలాంటి సినిమా తీయ్యలేదు. నిజం చెప్పాలంటే ఈ సినిమా చూశాక ప్రభాస్ నటించిన బాహుబలి కన్నా కూడా ఈ సినిమానే ఇష్టపడతాం. అంతాలా ప్రాణం పెట్టి నటించాడు.” ఇక ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి అభిమాని ప్రభాస్ నటనపై ప్రశంసలు గుప్పిస్తూ సినిమా ఎలా ఉందనే విషయాన్ని చెప్పుతున్నారు.

అయితే కొందరు మాత్రం సినిమా చుసిన జనాలు సినిమా లో చెప్పుకోతగిన ఎలిమెంట్స్ ఏం లేవు అని..ప్రభాస్ నటన ప్రంగా బాగున్నా..సినిమా సాగాదీశాడు అని..మధ్య మధ్యలో ఇంకొంచెం కామెడీ పెట్టి ఉంటే బాగుండేదని రివ్యూ ఇస్తున్నారు. అంతేకాదు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సినిమా గురించిన విశేషాలను చెప్పుకొస్తున్నారు. అనుకోని పరిస్ధితుల్లో ట్రెయిన్ లో విక్రమాదిత్యకు ప్రేరణ పరిచయం అవుతుంది. ఇక అమ్మడిని చూడగానే విక్రమాదిత్య కు మదిలో ప్రేమ గంటలు మోగుతాయి. వెంటనే ప్రేరణ ప్రేమలో పడిపోతాడు. అదే మనం అంటాంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అలా..కానీ అసలు ట్వీస్ట్ తరువాత తెలుస్తుంది. ఇద్దరి మధ్య చాలా ఫన్ని సీన్స్ వస్తాయి. ముఖ్యంగా వీళ్ల మధ్య వచ్చే మాటలను రొమాంటిక్ కపుల్స్, లవర్స్ ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటాయి. అసలు ఈ సినిమాకి మెయిన్ హైలెట్ క్లైమాక్స్ అంటూ అద్భుతంగా తెరకెక్కించారు రాధా కృష్ణ అని ప్రభాస్ ఫ్యాన్స్ పొగిడేస్తుంటే.. మరి కొందరు ఈ సినిమా ప్రభాస్ రేంజ్ కి సెట్ అయ్యేది కాదు..క‌థ‌లో లవ్ కన్నా కూడా క‌న్‌ఫ్యూజ‌న్లే ఎక్కువైయాయి..దానికి తోడు, స్లో నెరేష‌న్ కూడా ధియేటర్స్ కి వచ్చిన జనాల సహనాని బాగా పరీక్షించింది అంటూ దారుణ కామెంట్స్ చేస్తున్నారు. ఎవ్వరు ఊహించని క్లైమాక్స్ ఇది అంటూ .. సినిమాకు అదే ప్రత్యేకం అని చెప్పుకొస్తున్నారు ప్రభాస్ అభిమానులు.కానీ కొందరు సినిమా చూసిన జనాలు జెన్యూన్ టాక్ ఇదే అంటూ క్లైమాక్స్ మనం ఏదో అనుకుంటే అక్కడ ఇంకేదో చూయిస్తారు..జనలాకి క్లమాక్స్ చూసి పిచ్చెక్కిపోద్ది అలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిత్రంలో డార్లింగ్ ప్రభాస్- పూజ హెగ్డే కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని రివ్యూ ఇస్తున్నారు .

Share post:

Popular