ప్రభాస్ రాధేశ్యామ్ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాదేశ్యామ్ సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. ఇటీవల చిత్రబృందం ప్రకటించినట్లుగా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఏకంగా 7010 తెరలపై ఈ సినిమా ఒకేసారి ప్రసారమవుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు ముగిసాయ్. ఇండియాలో ప్రీవియస్ షోలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా రివ్యూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అటు అభిమానులు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ఇక ఒక్కసారి రివ్యూ లోకి వెళ్లి చూస్తే..

కథ ఏంటంటే : 1976లో కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల విక్రమాదిత్య ( ప్రభాస్) ఇటలీ వెళ్ళిపోతాడు. భారతదేశంలో విక్రమాదిత్య నెంబర్వన్ ఫామిస్ట్.. ఇక ఇటలీకి వెళ్ళిన తర్వాత అనుకోని విధంగా ప్రేరణ ( పూజా హెగ్డే )ని కలుస్తాడు. ఇక మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు విక్రమాదిత్య. ఇక కొన్నాళ్ళకి ప్రేరణ కూడా విక్రమాదిత్య తో ప్రేమలో పడుతుంది. ఇక వీరిద్దరి జీవితంలో విధి ఎలాంటి పాత్ర పోషిస్తోంది భవిష్యత్తును ముందే కనిపెట్టే ఫామిస్ట్ విక్రమాదిత్య ప్రియురాలి కోసం ఏం చేస్తాడు అన్నదే కథ.

ఎవరు ఎలా చేస్తారంటే : ఫామిస్ట్ గా విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు.. అసలు సిసలైన లవర్బాయ్గా ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇక ఇప్పటి వరకు మునుపెన్నడూ చూడని కొత్త కొత్తగా తన నటనతో మెప్పిస్తాడు. ఇక పూజా హెగ్డే అందం అటు సినిమాకి ప్లస్ పాయింట్.. ప్రతి ఫ్రేమ్ లో కూడా ఎంతో క్యూట్ గా అందంగా కనిపిస్తోంది. ప్రేరణ పాత్రలో ఒదిగిపోయి నటిస్తుంది పూజా హెగ్డే. భాగ్యశ్రీ తన పాత్రకు న్యాయం చేస్తోంది. ఇక జగపతి బాబు ఎప్పటిలాగానే తన నటనతో మెప్పిస్తారు ప్రియదర్శి, కృష్ణంరాజు, సత్యరాజ్ లాంటి వాళ్ల పాత్రలు కూడా సినిమాకు మంచి ప్లస్ పాయింట్గా మిగిలాయి అందరు వాళ్ళ వాళ్ళ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఇక తమన్ ఎప్పటిలాగానే తన మ్యూజిక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ హిస్టోరికల్ లవ్ స్టోరీని తన టేకింగ్ తో అద్భుతంగా మార్చేశాడు.

సినిమా ప్లస్ పాయింట్లు :

దర్శకుడు టేకింగ్.
సంగీతం.
ప్రభాస్, పూజా హెగ్డే నటన.
స్టోరీ.

మైనస్ పాయింట్లు :
సినిమా లో యాక్షన్ లేకపోవడం.
స్టోరీ కొంతమంది ప్రేక్షకులకు అర్థం కాకపోవడం.