‘రాధే శ్యామ్’ కేవ్వు కేకపెట్టిస్తున్న ప్రీ రివ్యూ!

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. యూ వీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌భాస్ బాహుబ‌లి ది బిగినింగ్‌, బాహుబ‌లి ది కంక్లూజ‌న్‌, సాహో సినిమాల త‌ర్వాత ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమా అంటే దేశం మొత్తం ప్ర‌భాస్ వైపే చేస్తోంది. ఆ స్థాయికి ప్ర‌భాస్ వెళ్లిపోయాడు.

ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమా నుంచి లార్జ‌న్ దెన్ సినిమాలే చేసుకుంటూ వ‌స్తున్నాడు. ప్ర‌భాస్ సాహో సినిమాకు ప్లాప్ టాక్ వ‌చ్చినా కూడా అదిరిపోయే వ‌సూళ్ల‌తో అంద‌రికి షాక్ ఇచ్చింది. పైగా నార్త్ లో ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమాకు రు. 150 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే సాహో త‌ర్వాత మ‌రో మూడేళ్లు గ్యాప్ తీసుకుని ప్ర‌భాస్ న‌టించిన సినిమా రాధే శ్యామ్‌.

యూవీ క్రియేష‌న్స్ రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌? గోపీచంద్‌తో 2015లో జిల్ సినిమా తీసిన రాధాకృష్ణ‌కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. థ‌మ‌న్ బీజీఎం అందించిన ఈ సినిమా రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే బుకింగ్స్ మొదలైన అన్ని చోట్ల ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని చోట్ల కూడా బుకింగ్స్ గట్టిగానే అవుతున్నాయి.

యూ ఎస్ లో ఇప్పటి వరకు 600కే డాలర్ల కి పైగా ప్రీ సేల్స్ ద్వారా బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్ర‌భాస్ జాత‌కాలు చూసే వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నాడు. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి త‌యారు చేసిన ఈ మూల క‌థ‌కు ప్రేమ కూడా జోడీంచి ఈ సినిమాను రూపొందించారు. ఇట‌లీలో ప‌లు లొకేషన్ల‌లో ఏకంగా 104 సెట్లు ఈ సినిమాకు వేశారు. మ‌రి ఈ సినిమా జాత‌కం ఏంటో రేపు తేలిపోనుంది.

Share post:

Latest