యూఎస్‌లో సాలీడ్ బుకింగ్స్‌తో కుమ్మేస్తోన్న ‘ రాధేశ్యామ్ ‘ క‌లెక్షన్లు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా రాధేశ్యామ్‌. బాహుబ‌లి 1, 2, సాహో సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన ఈ పాన్ ఇండియా దాదాపుగా మూడేళ్ల నుంచి సెట్స్ మీదే ఉంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డింది. ఈ సంక్రాంతికి రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకుంది.

అయితే సంక్రాంతికి ఒమిక్రాన్ నేప‌థ్యంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు పెర‌గ‌డంతో పాటు ఒమిక్రాన్ కూడా పూర్తిగా త‌గ్గిపోవ‌డం.. జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డం అల‌వాటు చేసుకున్నారు. అందుకే ఇప్పుడు రాధేశ్యామ్ రిలీజ్ చేస్తున్నారు. మూడేళ్లుగా ఊరిస్తూ వ‌స్తోన్న ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ అవుతోంది. రాధేశ్యామ్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో రెండు రోజులు టైం మాత్ర‌మే మిగిలి ఉంది.

ఇక ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు ఇప్ప‌టికే సాలిడ్ బుకింగ్స్ న‌మోదు అయ్యాయి. జ‌స్ట్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అలా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో వెంట‌నే 4 ల‌క్ష‌ల డాల‌ర్ల మార్క్ క్రాస్ అయ్యింది. ఇది హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరువ అయ్యింది. రిలీజ్‌కు మ‌రో రెండు రోజుల టైం ఉండ‌డంతో ఇది దాదాపు మిలియ‌న్‌కు ద‌గ్గ‌ర‌కు చేరుకుంటుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

ఇక రాధేశ్యామ్‌కు అమెరికాలో భారీ ఎత్తున ప్రీమియ‌ర్లు ప్లాన్ చేశారు. ఈ సినిమాకునలుగురు సంగీత దర్శకులు పని చేయగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

Share post:

Popular