రాజమౌళి ‘రాధే శ్యామ్‌’ని ప్రమోట్ చేస్తున్న వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే..!!

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న సినిమా “రాధే శ్యామ్‌”. అంతగా ఈ సినిమా కోసం ఎందుకు జనాభా ఎదురుచూస్తున్నారంటే..దానికి కారణం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అది ఎంతలా అంటే..మరే హీరో కూడా టచ్ చేయలేనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ఇప్పుడు ఈయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీనంతటికి కారణం రాజమౌళి తెరకెక్కించిన “బాహుబలి” వల్లే అని చెప్పక తప్పదు.

ఈ సినిమా తరువాత ప్రభాస్ సాహో అనే సినిమా తీసాడు కానీ ఆ మూవీ అనుకున్నంత విజయం అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ సరైన హిట్ కొడితే పండగ చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో 2017 లో రిలీజైన బాహుబలి-2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈయన..ఇప్పుడు మరి కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న “రాధే శ్యామ్‌” సినిమాతో చరిత్రలో గుర్తుండిపోయేలా విజయం సాధించాలని కోరుకుంటున్నారు అభిమానులు . ఇప్పటి వరకు ఉన్న టాక్ ప్రకారం చూస్తుంటే ఖచ్చితంగా ప్రభాస్ “రాధే శ్యామ్‌” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసాడు అని తెలుస్తుంది.

కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం..సక్సెస్ కోసం రాజమౌళి కూడా ప్రభాస్ కు బాగా హెల్ప్ చేస్తున్నారు. జక్కన్న ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. ఈ క్రమంలోనే పాన్‌ ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్‌’ సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి కలిసి ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యుల్లో వాళ్ళు సరదాగా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. నవ్వుతూ..జోక్స్ వేసుకుంటూ..ఆటపట్టించుకుంటూ చూడటానికి చాలా చక్కగా అనిపించింది. ఇక మాటల మధ్యలోనే ప్రభాస్ జక్కన్నని రాధేశ్యామ్ సినిమాను మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటూ నవ్వుతూనే అసలు విషయం అడిగేశాడు. దీని కి జక్కన్న రిప్లై ఇస్తూ..” అరె..నువ్వ నా డార్లింగ్ వి..నీ కోసం ఏదైనా చేస్తా” అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఈ ఒక్క మాట తో రాజమౌళి ప్రభాస్ అభిమానుల మనసు దోచేశాడు. దీని బట్టి ప్రభాస్-రాజమౌళి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఎంత స్ట్రాంగ్ అనే విషయం మనం అర్ధంచేసుకోవచ్చు. మరి చూడాలి ‘రాధే శ్యామ్‌’ సినిమా ఎలాంటి హిట్ అందుకోబోతుందో..?

Share post:

Popular