తూచ్..టైటిల్ అది కాదు..ప్రభాస్‌ సినిమా పేరు మారిపోయిందోచ్..?

ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీలతో ఫుల్ బిజీ బిజీ గా గడిపేస్తున్న నటుడు. ప్రజెంట్ ఆయన హీరోగా నటించిన “రాధేశ్యామ్‌” సినిమా మరో ఐదు రోజుల్లో గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా విక్రమ ఆదిత్య గా ప్రభాస్ మనకి కనిపించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ టైం ఘాటైన్ రొమాన్స్ చేశాడట డార్లింగ్. ఈ విషయాని ఆయన స్వయంగా చెప్పారు. పూజా తో ముద్దు సీన్ల ఉంటాయని…షర్ట్ విప్పి మరీ రొమాంటిక్ సీన్స్ తీయించారని చెప్పుకొచ్చాడు.

దీంతో ఈ సినిమా పై మరింత గా భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు అభిమానులు. దాదపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మేకింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ లోపే ప్రభాస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో డబుల్ జోష్ కనిపిస్తుంది.

అఫిషియల్ గా ప్రకటించకపోయినా..బ్యాక్ గ్రౌండ్ లో అన్నీ పనులు పూర్తి చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి. గత కొన్ని నెలలుగా ప్రభాస్-మారుతి కాంబో లో ఓ సినిమా రాబోతుందని ..అందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని..వాళ్లల్లో ఒకరు రాశీఖన్నా, మరోకరు మెహ్రీన్ ..మూడో హీరోయిన్ కోసం శ్రీలీల ని అనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈ సినిమా కి రాజా డిలెక్స్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు అంటూ నెట్టింట వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమా టైటిల్ ని మార్చేసారట మేకర్స్. కధకు మ్యాచ్ అయ్యే లా ఓ రొమాంటిక్ సస్పెన్స్ కామెడీ ధ్రిలర్ కు తగ్గటే టైటిల్ ని ఫైన్ల్ చేశారట. మరికొద్ది రోజుల్లోనే టైటిల్ ని రిజిస్టర్ చేయిస్తారని ..అప్పుడు అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తారని అంటున్నారు సినీ ప్రముఖులు. మరి చూడాలి ఈ టైటిల్ అయిన ఉంచుతారో..కొత్తది పెడతారో..?

Share post:

Popular