స్టార్ హీరోకి సారీ చెప్పిన పూజా..తప్పు తెలుసుకుందా ‘లేక’ తప్పక చెప్పిందా..?

సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ గా అడుగుపెట్టడమే గగనం. ఇక అలాంటిది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి..స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత బడా హీరోల పక్కన చేసినా..ఆమెలో కూడా టాలెంట్ లేకపోతే అభిమానులు ఎంకరేజ్ చేయరు. అయితే మొదటి నుండి ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని..ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేయించుకుంది పూజా హెగ్డే. ఒకటి కాదు రెండు కాదు వరుస గా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు.

దీంతో దర్శక నిర్మాతలు పూజాకి అవకాశాలు ఇవ్వడానికి భయపడారు. ఇక ఆ తరువాత ఎలాగోలా తారక్ సినిమాలో అవకాశం అందుకుని భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతలో వేసుకుని..ఇప్పుడు బడా బడా డైరెక్టర్స్ నే తన కోసం వెయిట్ చేసేలా చేసుకుంది. అందుకే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారుతుందో తెలియదు అంటుంటారు. ప్రస్తుతం పూజా వరుస సినిమాలతో బిజీ గా ఉంది. ఓ వైపు పాన్ ఇండియా సినిమాల్లో చేస్తూనే తనకు లైఫ్ ఇచ్చిన చిన్న డైరెక్టర్ల సినిమాలు చేసేందుకు ముందుకు వస్తుంది.

కాగా పూజా,ప్రభాస్ హీరో హీరోయిన్ లు గా నటించి విడుదలకు రెడీగా ఉన్న చిత్రం “రాధే శ్యామ్”. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పనుల్లో బిజీ అవుతుంది. అయితే మొన్నటి వరకు ఉప్పు నిప్పు లా ఉన్న ప్రభాస్-పూజా..ఇప్పుడు పాలు నీళ్లులా కలిసిపోయారు. ఇద్దరు కలిసి ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారట. ఈ సినిమా షూటింగ్ టైంలో పూజాకు ప్రభాస్ కు మధ్య ఫైట్ అయ్యిందని..దీంతో కొన్ని రోజులు షూటింగ్ కూడా ఆపేశారని..ఎంత మంది ట్రై చేసినా వాళ్ళు కలవడానికి సిద్ధంగా లేరని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా ప్రభాస్ కు సారీ చెప్పి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుందట. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో గొడవ పెట్టుకుంటే కష్టం అనుకున్నిందో ఏమో తెలియదు కానీ..తానే స్వయంగా ప్రభాస్ దగ్గరకు వెళ్ళి సారీ చెప్పిందట. అయితే కొందరు మాత్రం పూజాకి కోపం ఎక్కువని త్వరగా రియాక్ట్ అయిపోతుందని..ఆ తరువాత తనే తన తప్పు తెలుసుకుని అవతల వ్యక్తిని కూల్ చేస్తుందని అంటున్నారు సన్నిహితులు. ఏది ఏమైతేనేం కానీ మొత్తంగా ప్రభాస్-పూజా కలిసిపోయారు..అది చాలు..ఇక ఫుల్ హ్యాపీ అంటున్నారు ఫ్యాన్స్.

Share post:

Popular