ఇండస్ట్రీలో మరో పుష్ప రాజ్..ఊర మాస్‌ లుక్‌ తో రివీల్..!!

“పుష్ప” లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టైలీష్ స్టార్ బన్నీ హీరోగా నటించిన చిత్రం. గత ఏడాది డిసెంబరు 17 న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన చిత్రం మొదటి మూడు రోజులు మిక్స్డ్ టాక్ ను సంపాదించుకోగా..ఆ తరువాత ఎవ్వరు ఊహించని విధంగా కోట్లు కలెక్ట్ చేసి టాలీవుడ్ వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తో బన్నీ 100 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా..ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ నెలకొల్పింది.

ముఖ్యంగా ఈ సినిమాలో అందరికన్నా హైలెట్ గా నిలిచాడు బన్నీ. కాదు కాదు పుష్ప..పుష్ప రాజ్. ఆయన మాస్ లుక్ అదుర్స్ అంటూ బాలీవుడ్ బడా హీరోలు సైతం పొగిడేశారు. కాగా సేమ్ అలాంటి లుక్ లోనే నేచురల్ స్టార్ నాని మన ముందుకు రాబోతున్నాడు. ఈ మధ్యనే “శ్యామ్ సింగ రాయ్” మూవీతో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో .. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. వరుస సినిమాలకు కమిట్ అవుతూ..ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ..అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు నాని.

ఇప్పటికే ‘అంటే సుందరానికీ’ అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసేసుకున్న నాని.. ప్రస్తుతం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘దసరా’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో ఆయన నాని ని తెర పై ఎలా చూపిస్తారా అనే డౌట్లు అందరికి ఉండేవి. కానీ తాజాగా రిలీజ్ చేసిన నాని లుక్స్ చూసిన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే ఇలాంటి గెటప్ నే నాని నుండి ఎక్స్ పెక్ట్ చేసేది అంటూ పొగిడేస్తున్నారు. ఆ ఫోటోలో నాని ఊర మాస్ లుక్ లో కనిపిస్తూ నోట్లో సిగరెట్ పెట్టుకుని ఉన్నాడు. ఈ మాస్ లుక్ లో నాని చూసిన వాళ్లు అంతా ఈయన అచ్చం పుష్ప సినిమాలో పుష్ప రాజ్ లా ఉన్నాడంటున్నారు. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికె ఓ టాక్ వినిపిస్తుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ = బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్‌ నటిస్తుంది.

Share post:

Popular