గ్లోబ్ అంతా దెక్కించేస్తా.. పిచ్చెక్కిస్తున్న మహేష్ పాట..తమన్ ఇరగదీసాడుగా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు..ఏం చేసినా వేరే లెవల్ లో ఉంటాది. అందరిలా ఆయన చేయడు..ఆయన కంటూ ఓ సపరెటు టైమింగ్ ఉంటాది. మిగతా హీరొలు పాన్ ఇండియా మూవీలంటూ ఎగబడిపోతుంటే.. ఈ హీరో మాత్రం తెలుగు సినిమాల వైపే మగ్గు చూపుతున్నారు. ప్రజెంట్ మహేష్ బాబు..డైరెక్టర్ పరశూరామ్ డైరెక్షన్ లో “సర్కారు వారి పాట ” అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్ అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చి..వచ్చి..ఫైనల్ గా త్వరలోనే మనముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలో సినిమా పై హైప్స్ పెంచడానికి చిత్ర బృందం ఒక్కో పాట ను రిలీజ్ చేసుకుంటూ వస్తుంది. ఈ నేపధ్యంలోనే వాలంటైన్స్ డే కానుకగా “కళావతి” సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ పాట ఎంతో హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ రేంజ్ లో ఈ పాట అభిమానులను ఆకట్టుకుంది. ఈ పాట పై ఇన్స్టా లో ఎన్ని రీల్స్ ఉన్నాయో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అంతలా పాపులర్ అయ్యింది. కాగా, ఈ సినిమా నుండి కొద్దిసేపటి క్రితమే..మరో పాటను కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం.

“పెన్ని” అంటూ సాగే ఈ పాటలో మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని వెండి తెరకు ఇంట్రడ్యూస్ అవుతుంది. తండ్రి సినిమా తోనే తన సినీ కెరీర్ ని ప్రారంభించేసింది ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ సితార. కాగా ఈ పాట విషయానికి వస్తే మాహేష్ బాబు క్లస్ లుక్ అద్దిరిపోయింది. వెనక బ్యాక్ గ్రౌండ్ కూడా బాగుంది. ఇక లిరిక్స్ విషయానికి వస్తే..టూ గుడ్. నేటి యువత ఇష్టపడేలా..మాస్ పదాలు వాడుతూ..”నీ బాబు బిల్ గేట్స్ , నీ బాబాయి బిడెన్, గ్లోబ్ అంతా దెక్కించేస్తా” అంటూ ఊర మాస్..ప్లస్ క్లాస్ పదాలను మిక్స్ చేస్తూ పిచ్చెక్కించేసారు. ఇక తమన్ మ్యూజిక్ పాటకే హైలెట్ గా నిలిచింది. తమన్ బీట్ గురించి ప్రతేకంగా చెప్పాలా..చించి…చించి..చించేశాడు అంటున్నారు నెటిజన్స్. మరి ఆ పాటను ఓ సారి మీరు వినండి.

Share post:

Popular