డైరెక్టర్ వంశీ ప్రేమలో భానుప్రియ.. కానీ చివరికి..!!

అలనాటి హీరోయిన్ భానుప్రియ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె నటించిన సినిమాలలో ఎక్కువగా తెలుగు అమ్మాయిలా నటిస్తూ ఉండేది. ఇలా ఎంతో పేరు సంపాదించిన భానుప్రియ అప్పట్లో ప్రముఖ డైరెక్టర్ వంశీ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఈ విషయంపై కెమెరామెన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. వాటి గురించి చూద్దాం.

ప్రముఖ కెమెరామెన్ లో ఒకరైన ఎం.వి.రఘు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. డైరెక్టర్ ఎం.వి.రఘు మాట్లాడుతూ తను మొదట్లో వంశీ, కె.విశ్వనాథ్ డైరెక్టర్ దగ్గర పని చేసినట్లుగా తెలియజేశారు. కానీ దర్శకుడు కె.వాసు మాత్రం తనకు బ్రేక్ ఇచ్చారని తెలియజేశారు. డైరెక్టర్ విజయబాపినీడు దగ్గర తెరకెక్కించిన మగమహారాజు చిత్రంతో తనను తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారని ఆయన తెలిపారు. ఇక విజయబాపినీడు తనను ఎంతగానో ప్రోత్సహించారని తెలియజేశారు.

ఇక చిరంజీవి నటించే సినిమాలలో ఎక్కువగా లొకేషన్స్ కెమెరామెన్ గా ఉండేవారని తెలియజేశారు ఈయన. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఏ చిత్రాన్ని తెరకెక్కించినా కూడా కెమెరామెన్ గా ఉండేవారని తెలిపారు. ఇక రఘు సినిమాలలో లేనప్పుడు వంశీ చాలాసార్లు తన పేరును తలుచుకొనే వారిని రఘు తెలియజేశారు. ఇక కొన్ని సందర్భాలలో తనకు వస్తాయనుకున్న చిత్రాలు అనుకోకుండా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి అని అలాంటి సమయంలోనే చాలా ఫీలింగ్ ఉంటుందని రఘు తెలిపారు.

అయితే ఈ విషయంపై అల్లుఅరవింద్ నీకు రాసిపెట్టి ఉంటే ఆ చిత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నీ దగ్గరికి వస్తుంది అని తెలిపే వారట. వంశీకి తనకు మధ్య కొన్ని గొడవలు ఉన్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలిపారు. కేవలం ఒక మేకప్ విషయంలో మాత్రమే ఇలాంటి చర్చలు జరిగాయని తెలిపారు రఘు. ఒక సినిమా షూటింగ్ సమయంలో భానుప్రియను మేకప్ తగ్గించుకోమని చెప్పినందుకు వంశీ..అందరి ముందర చెప్పానని ఫీలయ్యాడట. దీంతో భానుప్రియ హర్ట్ అయిందని, తనతో చెప్పినట్లు గా వంశీ రఘుకి తెలియజేశారు.

అయితే వంశీ తనకు సారీ చెప్పమని చెప్పగా.. నేను అలాంటివి చేయను కావాల్సి వస్తే సినిమా మానేస్తాను అని చెప్పానని తెలియజేశారు. దీంతో వంశీ, భానుప్రియ పై అప్పట్లో వచ్చిన గాసిప్స్ చాలా వైరల్ గా మారాయి.. ఈ గాసిప్స్ తరవాత భానుప్రియనే అతను ఇష్టపడటం మొదలు పెట్టాడు.. ఆ విషయంలో తను కూడా కో-ఆపరేటివ్ చేసిందని కానీ వాటిలో కొన్ని నిజాలు కొన్ని గాసిప్స్ గానే ఉన్నాయని తెలియజేశారు రఘు.