అమ్మ నాగార్జున‌తో.. కూతురు అఖిల్‌తో… ఈ న్యూస్ వైరల్ !

అక్కినేని అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైయింది. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్, అఖిల్ తో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు రెండు రోజులుగా వ‌స్తోన్న వార్త‌లు నిజం అయ్యాయి. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా జాన్వీక‌పూర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన‌ట్టు టాక్ ? క‌ర‌ణ్ జోహార్‌కు జాన్వీ ఆస్థాన క‌థానాయిక అన్న సంగ‌తి తెలిసిందే.

ఇక జాన్వీని ఎప్ప‌టి నుంచో తెలుగులో న‌టింప‌జేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకున్నారు. ఇక రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాతో పాటు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు సినిమాలోనూ హీరోయిన్‌గా ఆమె పేరు వినిపించింది. అల్లు అర్జున్ ప‌క్క‌న కూడా జాన్వీ పేరు విన‌ప‌డింది.

శ్రీదేవి ఉన్న‌ప్పుడు ఆమె కూడా తెలుగులో ఓ సినిమాలో జాన్వీని న‌టింప‌జేసి ఆమెకు ఇక్క‌డ క్రేజ్ వ‌చ్చేందుకు ట్రై చేసింది. అది సాధ్యం కాలేదు. ఇక ఇప్పుడు కూడా కొద్ది రోజులుగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా ఆమె తెలుగులో మాత్రం న‌టించ‌లేదు. ఇక ఇప్పుడు క‌ర‌ణ్ జోహార్ తాను అఖిల్‌తో తీసే పాన్ ఇండియా సినిమాకు జాన్వీనే హీరోయిన్‌గా తీసుకుంటున్న‌ట్టు టాక్ ?

ఇటివల బోణీ కపూర్ కూడా హైదరాబాద్ వచ్చినపుడు జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ అతి త్వరలో వుంటుందని చెప్పారు. ఇది అఖిల్ సినిమానే అని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో అతిలోక సుంద‌రి, జాన్వీ త‌ల్లి అయిన శ్రీదేవి ప‌క్క‌న అఖిల్ తండ్రి నాగార్జున న‌టించాడు. ఇప్పుడు నాగ్ త‌న‌యుడు అఖిల్ స‌ర‌స‌న శ్రీదేవి కుమార్తె జాన్వీ న‌టిస్తుండ‌డం అరుదైన విష‌యం. ఇక అఖిల్ తాత ఏఎన్నార్ ప‌క్క‌న కూడా శ్రీదేవి న‌టించింది.

Share post:

Latest