విడాకుల తరువాత సమంత తన పెళ్లి చీరను ఏం చేసిందో తెలుసా..?

స్టార్ హీరోయిన్ సమంత సినిమాల పరంగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నా ..సక్సెస్ అయినా..వ్యక్తిగతంగా మాత్రం ఫ్లాప్ అయ్యింది. జీవితంలో తను తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణం గా ఫెయిల్ అయ్యింది. మనందరికి తెలిసిన సంగతే అక్కినేని కుర్రాడు నాగ చైతన్య-సమంత ప్రేమించి..ఇంట్లో పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్ళి చేసుకున్నారు. అప్పట్లో వీళ్ళ పెళ్లి ఓ పండగలా జరిగింది. వద్దు,లేదు,కాదు అని అనకుండా డబ్బు కుమ్మరించి కొడుకు పెళ్లిని గ్రాండ్ గా చేశాడు అక్కినేని నాగార్జున. అబ్బో..అప్పట్లో వీళ్ళు చేసిన హంగామా అంతా ఇంత కాదులేండి..!

చైతన్య, సమంతలు.. 2017లో గోవాలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకన్నారు. అయితే పెళ్ళికి ముందు ఎన్ని ఫంక్షన్లు జరిగినా..పెళ్ళి వేడుకను మాత్రం తెలుగింటి పద్ధతిలో సాంప్రదాయబద్ధంగా జరిపించారు నాగ్. ఈ విషయంలో ఆయనను మెచ్చుకుని తీరాల్సిందే. ఇక పెళ్లి బట్టల విషయానికి వస్తే ..అప్పట్లో సమంత తన పెళ్లికి కట్టుకునే చీర ఎంత కాస్ట్లీ గా ఉంటుందో..ఎవరు డిజైన్ చేస్తారో..ఎంత ట్రెండీగా ఉంటుందో అని చాలా మంది జనాభా వెయిట్ చేశారు. కానీ సమంత చీర చాలా సింపుల్ గా చూడగానే పెళ్లి కల ఉట్టిపడేలా ఉంది. ఇంతకి సమంత తన పెళ్ళిలో కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా..?

పెళ్లి వేడుకలో సమంత ధరించిన చీర మరెవరిదో కాదు.. చైతన్య అమ్మమ్మ ది. దగ్గుబాటి రాజేశ్వరి గారి చీరనే సమంత కట్టుకుంది. అంటే రామనాయుడి భార్యది. అమ్మమ్మ గుర్తుగా ఆ ఆ చీరను రీ మోడలింగ్ చేసి పెళ్లిలో కట్టుకోమని సమంతకి చెప్పింది చైతన్యనేనట. ఇక ఈ శారీ టోటల్ రీ మోడలింగ్ కోసం రూ. 40 లక్షల వరకు ఖర్చు అయిందని టాక్. అప్పట్లో సమంత కట్టుకున్న ఈ చీర కు సంబంధించి తెగ చర్చ జరిగింది. ఇక్ దీని తరువాతే..అందరూ కూడా ఈ ప్లార్ములా ని ఫాలో అవుతూ..అమ్మమ్మ అమ్మ ల చీరలను రీ డీజైన్ చేస్తూ తమ పెళ్లికి కట్టుకుంటున్నారు. అయితే, విడాకుల తరువాత సమంత ఆ చీరను దగ్గుబాటి ఫ్యామిలీకి తిరిగిచ్చేసిందట. స్వయాన సమంతనే వెళ్లి తన మాజీ అత్తగారు(నాగార్జున మొదట భార్య) కి ఇచ్చి.. చైతన్యకి సంబంధించిన జ్ఞాపకాలు నా దగ్గర వద్దు అంటూ ఆ చీరను రీటర్న్ చేసేసిందట. ప్రజెంట్ సామ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Share post:

Popular