ఆ స్టార్ హీరోకి బిగ్ షాక్..సినిమాలపై నిషేధం.. థియేటర్ ఓనర్స్ సంచలన నిర్ణయం..!!

దుల్కర్ సల్మాన్‌..పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో .. సైలెంట్ లుక్స్ తో ఎన్నో సినిమాలో నటించి మెప్పించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన. నిజానికి ఆయన మలయాళ నటుడే అయినా..తమిళ, తెలుగు భాషల్లో సినిమాల్లో నటించి..అందరికి సుపరిచితుడిగానే మారాడు. మహానటి సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో నటించిన ఈయన పై స్టార్ హీరోలు సైతం ఆయన నటనకు మెచ్చి దుల్కర్ సల్మాన్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు.

మమ్ముట్టి వారసుడిగా ఇందస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయనకి సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది. ఆయన సినిమాలు బాగుంటాయి..సరదాగా చూసి ఎంజాయ్ చేయచ్చు అంటూ అభిమానులు పొగిడేస్తారు. అయితే అలాంటి నటుడు దుల్కర్ సల్మాన్‌కు కేరళ రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు గట్టి షాకినిచ్చాయి. యస్.. దుల్కర్ సల్మాన్‌ సినిమాల పై కేరళ థియేటర్ ఓనర్స్ నిషేధం విధించారు. దుల్కర్ నటించిన అన్ని చిత్రాలను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించారు.

భవిష్యత్తులో అతడు నటించబోయే చిత్రాలు..అలాగే ఇప్పటి వరకు ఆయన నటింటిన చిత్రాలన్నీ కూడా బాయ్‌కాట్ చేయాలని ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్‌ఈయూకే) నిర్ణయించింది. దీంతో ఒక్కాసారిగా దుల్కర్ సల్మాన్‌ అభిమానులు షాక్‌కు గురైయ్యారు. దానికి అసలు కారణం ఏమిటంటే.. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘సెల్యూట్‌’ ని ముందుగా థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలి అనుకున్నారు. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

కానీ లాస్ట్ మూమాంట్ లో ఆయన థియేటర్ల యాజమాన్యాలకు షాకిస్తూ.. ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నామని మూవీమేకర్స్ అనౌన్స్‌ చేశారు. దీనిపై ఆగ్రహించిన థియేటర్ ఓనర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓటిటీ లో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న దుల్కర్ సినిమాలను బ్యాన్ చేయాలంటూ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు దుల్కర్ రియాక్ట్ కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Share post:

Popular