అనసూయకి వార్నింగ్ ఇచ్చిన మెగా హీరో..ఇకనైనా మారుతుందా..?

అనసూయ..పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అటు బుల్లి తెర ..ఇటు వెండి తెర రెండింటిని ఏలేస్తూ ఇండస్ట్రీలో హీరోయిన్లకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. జబర్ధస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన ఈ యాంకరమ్మా..ఇప్పుడు సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రల్లో నటిస్తూ..తన నటనతో అభిమానులను మెప్పిస్తుంది.

రీసెంట్ గా పుష్ప సినిమాలో ద్రాక్షాయని పాత్రలో మెరిసిన అనసూయా లుక్స్ పరంగా ఆకట్టుకున్నా..నటన పరంగా పెద్ద గా స్కోఫ్ లేకపోవడంతో కొంచెం అభిమానులను నిరాశ పరిచింది. ఇక ఖిలాడి సినిమాల్లోను అంతే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిజానికి అనసూయలో ఓ మహానటి ఉంది. కానీ దాని ఏ డైరెక్టర్ బయటకి తీసుకురాలేకపోతున్నారు అంటున్నారు ఆమె అభిమానులు. కాగా అనసూయ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఓ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గానే చిత్రీకరణ జరుపుకున్న ఆ సీన్స్ కు సంబంధించిన విషయాలు నెట్టింట లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం..గాడ్ ఫాదర్ సినిమాలో అనసూయది నెగిటివ్ రోల్ అని తెలుస్తుంది. అను ఈ సినిమాలో ఓ పెద్ద ఛానెల్ ని నడుపుతూ ఉంటుంది. కానీ సడెన్ గా ఆమె నడిపే ఆ ఛానెల్ లాస్ లోకి వెళ్లిపోతుంది.. ఈ టైంలో ఓ సో కాల్డ్ డబ్బున్న విలన్ వచ్చి.. మీ ఛానెల్ లో చిరంజీవి గురించి నెగిటీవ్ గా తప్పుడు ప్రచారాలు చేయండి .. మీరు అలా చేస్తే..మీ సమస్యలని గట్టెక్కిస్తా ను అంటూ హామీ ఇస్తాడు. పాపం ఆ మాటలను నమ్మేసిన అను..చిరు కి వ్యతిరేకంగా దొంగ సాక్ష్యాలతో అతని జైల్లో పెట్టించేలా చేస్తుంది.

సీన్ కట్ చేస్తే..ఆ డబ్బున్న విలన్ అను ని మోసం చేసి వెళ్ళిపోతాడు. డబ్బు ఇవ్వడు. ఫైనల్ గా బెయిల్ పై విడుదలైన చిరు..అనసూయ దగ్గరకు వచ్చి..నీతిమాలిన పనులును చేయడం ఇకనైనా మానుకో అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి రప్పాడిస్తాడట. దీంతో అనసూయ చిరు పై పగ తీర్చుకొవడానికి ఎలాంటి పనులు చేస్తుంది..ఫైనల్ గా ఆమె మారిందా లేదా అన్నదే అస్సలు పాయింట్. ఇక విషయాలు తెలుసుకోవాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే..!!

Share post:

Popular