వామ్మో… బన్నీ కేరవాన్ డ్రైవర్ జీతం ఇంతా… !

స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడమే కాకుండా ప్రతి సినిమాలో కూడా తన స్టైల్ ని చూపిస్తూ స్టైలిష్ స్టార్ గా ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.ఇక తన నటనతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఇకపోతే ఈయన గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు అల్లుఅర్జున్. ఆ తర్వాత వరుస సినిమాలలో బిజీగా మారిపోయి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవడం జరిగింది.

ఇకపోతే వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే బన్నీ ఫాల్కన్ అనే సరికొత్త కేరవాన్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించు కోవడం జరిగింది. ఇకపోతే ఈ కేరవాన్ కు సంబంధించి లక్ష్మణ్ అనే బన్నీ వీరాభిమానిని డ్రైవర్ గా నియమించుకున్నాడు. షూటింగ్ కోసం ప్రత్యేకంగా పూణే నుంచి డిజైన్ చేయించుకున్న ఫాల్కన్ కేరవాన్ ను తన అభిరుచులకు అనుగుణంగా సుమారు రూ.7 కోట్లతో డిజైన్ చేయించుకున్నారు.

ఇక ఈ కేరవాన్ డ్రైవింగ్ కోసం లక్ష్మణ్ పదిహేను రోజుల పాటు పూణే వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే పూణే లో 15 రోజుల పాటు తన ఖర్చులను కూడా అల్లు అర్జున్ భరించారని ఇంటర్వ్యూ సందర్భంగా లక్ష్మణ్ వెల్లడించారు. నిజానికీ లక్ష్మణ్ అల్లు అర్జున్ కు ఎంత అభిమాని అంటే లక్ష్మణ్ తన మెడపైన అల్లు అర్జున్ సిగ్నేచర్ వేయించుకునే అంతా.

ఇకపోతే సోషల్ మీడియాలో పెద్దఎత్తున లక్ష్మణ్ కు జీతం చెల్లిస్తున్నారు అనే విషయం వైరల్ అవుతుండగా ఈ విషయంపై లక్ష్మణ్ స్పందించాడు. అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానంతో నేను ఆయన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాను నాకు నెలవారీ జీతం రూ.2 లక్షలకు మించి రాదు.. అని స్పష్టం చేశాడు. ఇక బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న పుష్ప – 2 సినిమా చేస్తున్నాడు.