ముగ్గురితో రిలేష‌న్‌.. షాకింగ్ సీక్రెట్లు రివీల్ చేసిన తేజ‌స్విని..!

తేజస్వి మదివాడ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి ఇండస్ట్రీ లోకి రాకముందు మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం తో డాన్స్ ట్యూటర్ గా మొదలుపెట్టి.. ఆ తర్వాత 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో సమంత కి చెల్లి పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో క్యాన్సర్ తో బాధ పడుతుంది అని .. అందుకు శస్త్రచికిత్స సమంతా చేయించింది అనే వార్తలు కూడా వచ్చాయి. ఇక తర్వాత తేజస్వి కేరింత , ఐస్ క్రీమ్ వంటి సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తేజస్వి మదివాడ అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన రచ్చ మామూలు కాదు. అందుకే ఆమె అతి తక్కువ సమయంలో ని సీజన్ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. ఇప్పుడు మళ్లీ తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా పాల్గొనడం జరిగింది. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓ టీ టీ వేదికగా ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.. ఇక ఈ సీజన్లో ఈమె ఆచితూచి అడుగులు వేస్తోంది అని చెప్పవచ్చు. అంతేకాదు సహా కంటెస్టెంట్ ల తో చాలా మర్యాదగా నడుచుకుంటోంది.

ఇదిలా ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో విజేతగా మొట్టమొదటి హౌస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది. ఇక అందులో భాగంగానే గురించి తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పాల్సిన సమయం రానే వచ్చింది.ఎంతమందితో రిలేషన్షిప్ మెయింటైన్ చేశావు అన్న ప్రశ్నకు తేజస్విని స్పందించడం జరిగింది.. అయితే ఇది వరకు మాత్రం ఇద్దరితో రిలేషన్ షిప్ లో ఉన్నాను కానీ బ్రేకప్ అయ్యిందని తెలియజేసింది.

ప్రస్తుతం మాత్రం మూడవ రిలేషన్ లో ఉన్నాను.. అయితే అది రిలేషనా..కాదా అన్న విషయం తెలియడం లేదని తేజస్విని చెప్పుకొచ్చింది. అయితే ఇంతవరకు తేజస్విని ఎప్పుడు తన రిలేషన్షిప్ గురించి కానీ బ్రేకప్ విషయాల గురించి కానీ ఎక్కడ తెలియజేయలేదు వార్తలు కూడా వినిపించలేదు.అయితే బిగ్ బాస్ షోలో తానే స్వయంగా రిలేషన్ షిప్ గురించి బయట పెట్టింది. ప్రస్తుతం ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Popular