ఆ మ్యాటర్లో సమంత ను తొక్కేసిన బేబమ్మ.. నీ ఓవర్ యాక్షన్ తగలెయ్యా..?

సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నారు. కొత్త అందాలు వచ్చినా పాత అందాలను వదలటం లేదు మన కుర్రాళ్ళు. ఏ అందానికి ఉండే క్రేజ్ ఆ అందానికి ఉంది..అనుకున్నారు ఏమో తెలియదు కానీ..అటు పాట అందాలను..ఇటు కొత్త అందాలను సమాంతరంగా ఆదరిస్తున్నారు. ఇక దీంతో కొత్త గా వచ్చిన ముద్దుగుమ్మలు రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూయిస్తున్నారు. ముఖ్యంగా నిన్న కాక మొన్న వచ్చిన కుర్ర బ్యూటీలు సైతం కోట్లల్లో పారితోషకాని అందుకుంటూ షాక్ ఇస్తున్నారు.

వాళ్లలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది..కన్నడ సోయగం కృతి శెట్టి గురించి. వచ్చిన మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ హాట్ అమ్మడు..ఆ తరువాత నాని తో “శ్యామ్ సింగ రాయ్”..లో మోడ్రెన్ లుక్ తో కేకపెట్టించి సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తరువాత మూడో సినిమా అక్కినేని హీరోస్ తో జతకట్టి..స్టార్ సెలబ్రిటీల అటెన్షన్ గ్రాబ్ చేసుకుంది. ముఖ్యంగా బంగార్రాజు ఈవెంట్ లో కృతి అందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ ప్రమోషన్స్ లో కృతి పర్ ఫామెన్స్ చూసి అక్కినేని ఇంటి కోడలు అయిపోతుందని అనుకున్నారు అంతా..అంతలా ఆ ఫ్యామిలీతో కలిసిపోయింది ఈ చిన్నది. మరికొందరు..”నీ ఓవర్ యాక్షన్ తగలెయ్య”అంటూ కూడా దారుణంగా కామెంట్స్ చేశారు.

ఇక ఇప్పుడు కోలీవుడ్ లో తన్ లక్ ను పరీక్షించుకోబోతుంది. డైనమిక్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య సరసన..కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే అమ్మడు ను ఇక పట్టలేం. ఇప్పటికే దాదాపు 10 సినిమాలు చేతిలో పెట్టుకుని మరో నాలుగేళ్ళు వరుసగా కాల్ షీట్లు ఫిల్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ..సూర్య సినిమాలో నటించడానికి ఏకంగా కోటీ 50 లక్షలు డిమాండ్ చేసిందట. నిజానికి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసిన సమంత కూడా తన స్టార్టింగ్ సినిమాలకు కోటి రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఇప్పటికి సమంత 2-3 కోట్లు పారితోషకమే తీసుకుంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కన్నడ పాప మాత్రం క్రేజ్ తో పాటు పారితోషకానీ పెంచుకుంటూ పోతుంది. మరి దీనికి బ్రేకులు ఎప్పుడు పడతాయో..?