బాహుబలి తర్వాతే వాటిని నమ్ముతున్నా..జ్యోతిష్యం పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

నేటి కాలంలో చాలా మంది జ్యోతిష్యాలని నమ్మరు. అవి అంతా ఫేక్ అని..మన టైం ఎలా రాసి పెట్టిందో అలానే జరుగుతుందని..దాని గురించి ముందుగా ఆలోచించి..బాధపడటం వేస్ట్ అంటుంటారు. మరికొందరు అయితే ప్రతి దానికి దాని మీదే బేస్ అయిఉంటారు. అయితే మన హీరో ప్రభాస్ మాత్రం అలాంటివి నమ్మరట. “రీజన్ ఇది అని చెప్పలేను కానీ. మొదటి నుండి అలాంటివి నమ్మను” అంటూ చెప్పుకొచ్చాడు.

డైనమిక్ డైరెక్టర్ రాధకృష్ణ డైరెక్షన్ లో స్టార్ హీరో ప్రభాస్- అందాల తార పూజా హెగ్డే జంటగా కలిసి నటించిన చిత్రం “రాధే శ్యామ్”. ఈ సినిమా ఓ లవ్ స్టోరీ గా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ పూజా ప్రేరణ గా మనకు కనిపించబోతుంది. అనుకోకుండా తనకు ఎదురైన ఓ సంధర్భంలో ప్రముఖ పామిస్ట్​ విక్రమాదిత్య ని కలుస్తుంది. ఇక ఆ టైంలో తనకు ఎదురైన సంఘటనులు..గుర్తుకు వచ్చిన పునర్జన్మల తాలుకు మెమోరీస్..దానికి విక్రమాదిత్య ఇచ్చే ట్వీస్ట్. చాలా బాగా తెరకెక్కించిన్నట్లు చిత్ర బృందం చెప్పుకొచ్చారు. ప్రేరణతో ప్రేమలో పడిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు విక్రమాదిత్య ఆమెను రక్షించడానికి విధితో పోరాడి..ఫైనల్ గా విధి రాసిన వింత నాటకంలో చనిపోతాడంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న రాధేశ్యామ్‌ సినిమా ని గ్రాండ్ గా రిలీజ్‌ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో..చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్‌ స్పీడ్‌ అప్ చేసింది. ప్రస్తుతం ముంబైలో ఉన్న ప్రభాస్​ అక్కడ పలు ఛానెల్స్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయనకు మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా అని అడిగిన్నప్పుడు..” నేను పెద్దగా ఇలాంటివి నమ్మను. కానీ మా ఫ్రెండ్స్ చెప్పుతుంటే విన్నాను.మన నాలెడ్జ్​కు మించింది ఏదో ఉంటుందని మాత్రం నమ్ముతాను. అయితే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సాధించిన అద్భుతమైన విజయం తర్వాత నేను విధిని నమ్మడం ప్రారంభించాను. నిజం చెప్పాలంటే ఈ సినిమా తర్వాత నుంచే హార్డ్ వర్కును నమ్ముతున్నా . మనం కష్టపడితే ఖచ్చితంగా ఫిలితం ఉంటాది. అది మాత్రమే నేను చెప్పగలను.. నమ్ముతున్నాను.’ అని తెలిపాడు డార్లింగ్​ ప్రభాస్​.

Share post:

Latest