వరుణ్‌ తేజ్‌ పెళ్లెప్పుడు? నాగబాబు ఆన్సర్‌ వింటే షాక్ అవ్వాల్సిందే..!!

సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలందరు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. నితిన్,నిఖిల్,రానా, లాంటి వాళ్లంతా ప్రేమ పెళ్లిలు చేసుకుని..బ్యాచిలర్ లైఫ్ నుండి విముక్తి పొందారు. కానీ ఇండస్ట్రీలో ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్నారు. ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉండేది మన డార్లింగ్ ప్రభాస్. కోట్లాది మంది అభిమానులతో పాటూ..బడా బడా స్టార్స్ కూడా ఈయన పెళ్లి చేసుకుంటే నాలుగు అక్షింతలు వేద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ హీరో పెళ్లి ఊసే ఎత్తడు..అసలు చేసుకుంటాడా లేడా అనే డౌట్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ పెళ్లి వయసు దాటిపోయి చాలా ఏళ్లు అవుతుంది.

ఇక ఫ్యామిలీ హీరో శర్వానంద్ కూడా ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పుతాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ధర్డ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ టాలీవుడ్ మెగా ప్రిన్ వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు కోడుకు. వివాదాలకు దూరంగా..ప్రశాంతతకు దగ్గరగ ఉండే వరుణ్ అంటే ఇష్టం లేని వారంటూ ఉండరు. సినిమా హిట్టా ఫ్లాపా అనే తేడా లేకుండా..చేసిన ప్రతి సినిమాలో ఢిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలు చూస్ చేసుకుంటూ..స్టార్ హీరోలకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. మరి కొద్ది రోజులో గని సినిమా తో మరో బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడానికి రెడీగా ఉన్న ఈ హీరో పెళ్ళి మ్యాటర్ గత కొన్ని నేలలుగా మీడియాలో వైరల్ అవుతుంది.

హీరోయిన్ లావణ్య తో ప్రేమలో ఉన్న మెగా హీరో త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడని ఆ వార్తల సారంశం. కానీ ఇప్పటి వరకు దీని పై అఫిషియల్ ప్రకటన అయితే లేదు. కాగా రీసెంట్ గా వరుణ్ ఫాదర్ నాగబాబు..అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ “వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు బ్రో” అంటూ ఓ ప్రశ్న వేశాడు..ఈ క్వశ్చన్ విని విని విసిగిపోయిన నాగబాబు.. ఈ క్వశ్చన్‌కు వరుణ్‌తేజే ఆన్సరిస్తాడని చెప్పి చాకచక్యంగా తప్పించుకున్నాడు. అంతే వరుణ్ లావణ్య ల ప్రేమ మ్యాటర్ నిజమే అంటూ మళ్ళీ వాళ్లకు సంబంధించిన ఓల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. నాగబాబు కి లావణ్య అంటే ఇష్టం లేదు అని..అందుకే..ఇలా ఆన్సర్ ఇచ్చాడని..లేకపోతే ఏ ఫాదర్ కూడా కొడుకు పెళ్లి విషయంలో ఇలా మాట్లాడడు అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు . మరి వరుణ్‌ తేజ్‌ పెళ్లెప్పుడు? అనే ప్రశ్నకు ఆయన అయినా సమాధనం ఇస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే..!

Share post:

Popular