ఎన్టీఆర్‌ని వాడుతున్న వైసీపీ…?

రాజకీయం కలిసొచ్చే అంశాలని వైసీపీ ఏ మాత్రం వదులుకోవడం లేదు…ఆఖరికి ప్రతిపక్షాలు చేసే విమర్శలని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని రివర్స్‌లో వారికే కౌంటర్లు ఇస్తూ రాజకీయ లబ్ది పొందడానికి వైసీపీ బాగానే ప్రయత్నిస్తూనే ఉంది…ఇక తాజాగా కూడా జగన్ ప్రభుత్వం అదే చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…అసలు ఎప్పుడు, ఎక్కడా లేని విధంగా సినిమా టిక్కెట్ల అంశంపై సమస్య సృష్టించిందే జగన్ ప్రభుత్వం…ప్రజలకు కావల్సిన ప్రతి వస్తువు ధర పెరిగేలా చేయడమే కాకుండా..ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పెంచిన ప్రభుత్వం…పేదవాళ్ళ కోసం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తున్నామని హడావిడి చేసింది.

కేవలం సినిమా వాళ్ళని తమ దగ్గరకు రప్పించుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారని అందరికీ అర్ధమవుతుంది..ప్రభుత్వం అనుకున్న విధంగానే సినిమా పెద్దలు కొందరు వచ్చి, జగన్‌ని కలిసి సమస్యని పరిష్కరించాలని వేడుకున్నారు. అయితే బాలయ్య, పవన్ లాంటి వారు పూర్తిగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళుతున్నారు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన పవన్ సినిమా…భీమ్లానాయక్ సినిమాకు చెక్ పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే.

అందుకే పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి..ఆఖరికి టీడీపీ సైతం పవన్‌కు సపోర్ట్ చేస్తూ..జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయింది..చంద్రబాబు, లోకేష్‌లు పవన్‌కు మద్ధతుగా నిలిచారు. ఇలా వారు పవన్‌కు మద్ధతుగా నిలవడాన్ని ఏపీ మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు..అసలు వారు ఎప్పుడైనా ఎన్టీఆర్ సినిమాలకు సపోర్ట్ చేసారంటూ రివర్స్‌లో కౌంటర్ ఇచ్చారు.

అయితే చంద్రబాబు, లోకేష్‌, ఎన్టీఆర్ ఒక ఫ్యామిలీ అని, వారు ఎప్పుడు ఎన్టీఆర్‌కు మద్ధతుగానే ఉంటారని, ఆ విషయం గురించి చెప్పాల్సిన పని లేదని, కానీ చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి పేర్ని, ఎన్టీఆర్‌ని లాగి రాజకీయం చేయాలని చూశారని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. అంటే ఎన్టీఆర్‌ని, ఎన్టీఆర్ అభిమానులని ఇంకా టీడీపీకి యాంటీగా చేసి, రాజకీయంగా లబ్ది పొందడానికే ఇది చేశారని అర్ధమవుతుందని, కానీ పేర్ని ఎత్తులు వర్కౌట్ కావని అంటున్నారు.