ఫస్ట్ టైం అలాంటి పాత్రలో కనిపించనున్న రౌడీ హీరో..సెల్యూట్ చేయాల్సిందే..?

విజయ్ దేవరకొండ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే తన పేరుని స్టార్ హీరోల లిస్ట్ లో చేర్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో సైలెంట్ గా డీసెంట్ గా కనిపించిన ఈ హీరో..ఆ తరువాత రూట్ మార్చి..యంగ్ సెన్సేషన్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.

ఈ సినిమాలో ఆయన హీరోయిన్ షాలినీ పాండేతో చేసే రొమాన్స్ ఎంతమంది యువతను ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పట్లో ఈ సినిమా చూసి యువత పిచ్చేక్కిపోయారు..తమను తాము ఓ అర్జున్ రెడ్డిలా అనుకుని తెగ ఊగిపోయారు. ఇక సీన్ కట్ చేస్తే..ఆ తరువాత విజయ్ రేంజ్ మారిపోయింది. బడా బడా సెలబ్రిటీలు కూడా ఆయన యాక్టింగ్ కు ఫిదా అయిపోయారు. ఇప్పుడు విజయ్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తున్నాడంటేనే ఆయన రేంజ్ ఎలా మారిపోయిందో మనం అర్ధం చేసుకోవచ్చు.

కాగా ప్రజెంట్ డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో విజయ్ “లైగర్” అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రాబోతుంది. అయితే, ఈ సినిమా తరువాత మళ్ళీ పూరీలో కాంబోలో “జనగణమన” అనే సినిమా తీస్తున్నాడంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. లేటేస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాలో ఆయన ఇప్పటి వరకు చేయని పాత్ర చేస్తున్నాడంటూ మ్యాటర్ లీక్ అయ్యింది. ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారట. మిలటరీ హెయిర్ కటింగ్ తో విజయ్ దేవరకొండ కనిపిస్తాడట. ఇప్పటికే లొకేషన్ ల రెక్కీని నిర్వహించిన టీమ్ ఫస్ట్ షెడ్యూల్ కోసం ఆసక్తికరమైన ప్లేస్ ని ఫిక్స్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన హీరో ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ గా మారి ఎలాంటి విజయం అందుకుంటాడనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరి చూడాలి ఏం జరుగుతుందో..?

Share post:

Popular