మంచు ఫ్యామిలీకి మ‌రిన్ని క‌ష్టాలు.. ఇప్ప‌ట్లో తీరేలా లేవే..!

సినీ దిగ్గ‌జం.. మంచు మోహ‌న్‌బాబు ఫ్యామిలీకి సినిమా క‌ష్టాలు వ‌చ్చి ప‌డ్డాయి. ఇటు ఏపీలో ప్ర‌భుత్వం మారితే.. త‌న‌కు మేలు జ‌ర‌గుతుంద‌ని భావించిన ఆయ‌న‌.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీకి సాయం చేశారు. ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కూడా చేశారు. అనుకున్న‌ట్టుగానే వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. అయితే.. ప్ర‌భుత్వం మారినా.. త‌మకు ఆశించిన ప్ర‌యోజ‌నం ఏమీ క‌ల‌గ‌డం లేద‌ని.. మంచు ఫ్యామిలీ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. ఇటీవ‌ల సినీ స‌మ‌స్య‌ల‌పై చిరంజీవి స‌హా కొంద‌రు వ‌చ్చి.. జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీకి .. సీఎం జ‌గ‌న్ నుంచి మంచు కుటుంబానికి కూడా ఆహ్వానం అందింది.

ఈ విష‌యాన్ని మోహ‌న్‌బాబు కుమారుడు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు కూడా చెప్పారు. అయితే. త‌న తండ్రిని అడ్డుకున్నార‌ని.. అందుకే ఈ భేటీకి రాలేద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. నిజానికి మంచు మోహ‌న్‌బాబును అడ్డుకునే అవ‌స‌రం ఎవ‌రికి ఉంది? ఎందుకు ఉంటుంది? అనేది ప్ర‌శ్న‌. అయితే.. ఇక్క‌డ ప్ర‌భుత్వం.. తొలుత చిరుతో భేటీ కావాడాన్ని మంచు కుటుంబం జీర్ణించుకోలేక పోతోంది.

త‌మ‌కు ముందు ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. ముందుగా చిరంజీవితో చ‌ర్చ‌లు జ‌రిపి.. త‌ర్వాత‌.. జ‌రిగిన భేటీకి.. త‌మ‌ను ఆహ్వానిస్తారా? అనేది మోహ‌న్‌బాబు ఆందోళ‌న‌. ఈ క్ర‌మంలో ఎవ‌రూ అడ్డుకోకుండానే.. త‌నంత‌ట త‌నే.. ఈ భేటీకి రాలేద‌ని.. టాలీవుడ్‌లో ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప‌ట్టుబ‌ట్టి మా సొంతం చేసుకున్నా.. ఇక్క‌డ కూడా ఎవ‌రూ మంచు కుటుం బాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం కూడా ఆయ‌న‌ను బాధిస్తోంది. సినిమా ప‌రిశ్ర‌మ క‌ష్టాల‌ను అసోసియేష‌న్‌కు చెప్పుకొనేందుకు కీల‌క హీరోలు ఎవ‌రు చొర‌వ చూప‌లేదు.

అదేవిధంగా నిర్మాత‌లు కూడా ప్ర‌య‌త్నించ లేదు. నిజానికి మా అధ్య‌క్షుడికి.. ఇప్పుడు వ‌చ్చిన క‌ష్టాలు చెప్పుకొనేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. దీనిని బ‌ట్టి.. తాము మా ను ద‌క్కించుకున్నా.. మ‌న‌సులు గెలుచుకోలేక పోయామ‌నే ఆవేద‌న వారిలో ఉంది. ఇలా.. మొత్త‌గా మంచు కుటుంబానికి సినిమా క‌ష్టాలు వ‌చ్చి ప‌డ్డాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share post:

Latest