వైసీపీ – టీడీపీ – జ‌న‌సేన మూడు పార్టీల్లోనూ ఒకే ర‌చ్చ …!

కొన్ని కొన్ని రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో రాజ‌కీయాలు ఇలా కూడా ఉంటాయా? అనే సందే హాలు వ‌స్తుంటాయి. ఎందుకంటే.. ఒక పార్టీపై గెలిచి.. మ‌రో పార్టీకి మ‌ద్ద‌తిచ్చే నేత‌లు ఏపీలోనే క‌నిపిస్తు న్నారు. నిజానికి ఒక పార్టీ త‌ర‌ఫున గెలిచిన వారు.. ఆ పార్టీ త‌ర‌ఫునే వాయిస్ వినిపించాలి. ఇది రాజ‌కీయం గా ప్ర‌ధాన క‌ట్టుబాటు. కానీ, ఏపీలో మాత్రం ఒక పార్టీలో గెలిచి.. మ‌రోపార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. దీనిని ఆయా రాజ‌కీయ పార్టీలు ఎలా ప్రోత్స‌హిస్తున్నాయో.. అనేది ఇటీవ‌ల హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన `ప్ర‌జాస్వామ్యం-పార‌ద‌ర్శ‌క రాజ‌కీయం` అనే చ‌ర్చ‌లో ప్ర‌ధాన అంశంగా మారింది.

ఏపీలోని అన్ని పార్టీల్లోనూ ఇదే క‌నిపిస్తోంది. అధికార వైసీపీని తీసుకుంటే.. ఎమ్మెల్యే నుంచి ఎంపీ వ‌ర‌కు కూడా.. వైసీపీ త‌ర‌ఫున గెలిచి.. టీడీపీ వాయిస్ వినిపిస్తున్నార‌నే వాద‌న ఉంది. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున గెలిచి న ఎమ్మెల్యేలు, ఎంపీల్లోనూ.. అధికార వైసీపీ.. బీజేపీ వాయిస్ వినిపిస్తున్నారు.. ఆయా ప‌పార్టీల‌కు అనుకూ లంగా ఉన్నారు. ఇక‌, జ‌న‌సేన త‌ర‌ఫున గెలిచిన ప్ర‌జాప్ర‌తినిధి కూడా వైసీపీ గూటికి చేరిపోయారు.

అయితే .. ఇవ‌న్నీ.. ఆయా పార్టీల్లో చ‌ర్చ‌కు రావ‌డం లేదు.. కేవ‌లం రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు మాత్ర‌మే ప‌నిచేస్తున్నా య‌నే వాద‌న ఉంది. పొరుగున ఉన్న ఏ రాష్ట్రంలోనూ.. ఇలాంటి ప‌రిణామాలు లేవ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌ర్ణాట‌క‌లో అయినా.. త‌మిళ‌నాడులో అయినా.. ఇలాంటి రాజ‌కీయాలు క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ ఇతర పార్టీల్లోకి వెళ్లాల‌నుకున్న అధికార ప‌పార్టీ నేత‌లు కానీ.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కానీ.. ధైర్యంగా వెళ్లిపోతున్నారు.

కానీ.. ఇప్పుడు.. ఏపీలో మాత్రం ఇలాంటి ప‌రిస్థితి ఉందని విశ్లేష‌కులు భావిస్తున్నారు. టీడీపీ నేత‌లు బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌ని.. అంటున్న ఆ పార్టీ… త‌న ఎమ్మెల్యేల‌పై అన‌న‌ర్హ‌త వేటు వేయించే ప్ర‌య‌త్నం చేయ‌దు. ఇక‌, వైసీపీ కూడా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తున్న ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధంగా లేదు. మ‌రోవైపు.. జ‌న‌సేన కూడా .. త‌న ప్ర‌జా ప్ర‌తినిధిని కంట్రోల్ చేసుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. మొత్తానికి ఇదీ ఏపీలో ప‌రిస్థితి.

Share post:

Popular