జనసేన దెబ్బ టీడీపీకి ఇంత గ‌ట్టిగానా…!

గత మూడు ఎన్నికల నుంచి మెగా ఫ్యామిలీ వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం, లాభం కూడా జరిగిందని చెప్పొచ్చు..కేవలం మెగా ఫ్యామిలీ ప్రభావం వల్ల టీడీపీ రాజకీయంగా నష్టపోవడం, లాభపడటం కూడా జరిగాయి..2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం వల్ల టీడీపీ ఎంతవరకు నష్టపోయిందో అందరికీ తెలిసిందే..ప్రజారాజ్యం దారుణంగా ఓట్లు చీల్చి టీడీపీకి డ్యామేజ్ చేసి, అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సాయం చేసింది. ఇక 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్..జనసేన పార్టీ పెట్టిన విషయం తెలిసిందే..అయితే అప్పుడు పవన్ పోటీ చేయకుండా..డైరక్ట్‌గా టీడీపీకి సపోర్ట్ చేయడం లాభం చేకూరిందని చెప్పొచ్చు.

అదే జనసేన వల్ల 2019 ఎన్నికల్లో టీడీపీ నష్టపోయింది..దాదాపు 30-40 సీట్లలో జనసేన ప్రభావం వల్ల టీడీపీ ఓడిపోయింది…అదే అప్పుడే టీడీపీ-జనసేనలు కలిసి ఉంటే ఫలితంలో కాస్త మార్పు వచ్చేది.
మరి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిస్తితి ఉంటుందంటే..ఇప్పుడే చెప్పలేని పరిస్తితి ఉంది…కానీ జనసేన గాని విడిగా పోటీ చేస్తే టీడీపీ మాత్రం నష్టపోవడం గ్యారెంటీ…కానీ అవి ఎన్ని సీట్లలోనో చెప్పలేం. అందుకే టీడీపీ..పవన్‌ని కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

కాకపోతే పవన్ నుంచి పెద్దగా రియాక్షన్ రావడం లేదు..దీంతో టీడీపీ ముందు ఒంటరిగానే సత్తా చాటాడానికి రెడీ అవుతుందని తెలుస్తోందో..ఎలాగో వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..అది ఆటోమేటిక్‌గా టీడీపీకే బెనిఫిట్ అవుతుంది. కాకపోతే జనసేన వల్ల ఓ 20 సీట్లలో టీడీపీకి నష్టం జరగొచ్చని రీసెంట్ సర్వేల్లో తేలిందట. 20 సీట్లలో నష్టం జరిగితే ఫలితాలు మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి..ఒకవేళ జనసేనతో గాని పొత్తు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు…లేదంటే టీడీపీకి నష్టం.

అయితే ఒంటరిగా పోటీ చేసిన నష్టపోకుండా ఉండాలంటే టీడీపీ నేతలు ఇంకా బాగా కష్టపడాలి. బాగా కష్టపడితే..డ్యామేజ్‌ని ఓ 10 సీట్లు వరకు తీసుకు రావొచ్చని తెలుస్తోంది. అంటే ప్రజా సమస్యలపై గట్టిగా పోరాటం చేసి…ప్రజలకు టీడీపీనే ఆప్షన్ అనే విధంగా ముందుకెళితే ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ పొత్తు ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు.