ఒక్కసారి కలువు సామ్..స్టార్ హీరోయిన్ సలహాకు సమంత ఊహించని రిప్లై ..!!

సమంత..ఓ కుందనపు బొమ్మ. టాలీవుడ్ లోకి ఏ మాయ చేసావే సినిమా తో ఎంట్రీ ఇచ్చి నిజంగానే కుర్రాళ్లను మాయచేసి బుట్టలో వేసుకుంది. సమంత అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. నిజానికి కొందరు హీరోయిన్లకు కొన్ని డ్రెస్సులు మాత్రమే బాగుంటాయి. కొందరు హీరోయిన్లు చీరలో చక్కగా కనిపిస్తే..కొందరు జీన్స్ టాప్ లో కనిపించి ఆకట్టుకుంటారు..మరి కొందరు హీరోయిన్లు బికినీలో కూడా బాగానే ఉంటారు. కానీ, అది ఏంటో తెలియదు కానీ, సమంత ఏ పాత్ర చేసినా..ఏ డ్రెస్సు వేసుకున్న బాగా సెట్ అవుతుంది అంటారు అభిమానులు.

ఆ అందానికే పడిపోయాడు నాగ చైతన్య. కానీ ఏం లాభం పట్టుమంటే పదేళ్లు కూడా కాపురం చేసుకోకుండా విడాకులు తీసుకొవడానికి సిద్ధపడ్డారు. విడాకుల తరువాత సమంత ఫుల్ జోష్ మీద ఉంది. వచ్చిన సినిమాలో నచ్చిన మూవీలకు సైన్ చేస్తూ..ఇష్టమైన ప్రదేశాలకు..నచ్చిన బట్టలు వేసుకుంటూ..ఇక నాకు లేదు అడ్డు..రారు పోటీ అన్నట్లు తెగ ఎంజాయ్ చేస్తుంది అమ్మడు. అయితే, ఎవ్వరు ఊహించని విధంగా సమంతకు మహానటి కీర్తి సురేష్ ఓ సలహా ఇచ్చింది. దీంతో సామ్ తో పాటు ఇండస్ట్రి పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు.

సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న కీర్తి సురేష్ రీసెంట్ గా పోస్ట్ చేస్తూ..ఓ పాప వీడియోని షేర్ చేసింది. ఇక ఆ వీడియో లో పాపను కీర్తి నువ్వు పెద్ద అయ్యాక ఏం అవుతావు అని అడగ్గా..ఆ పాప సమంత అవుతా అంటుంది. ఇక ఇదే విషయాని సామ్ కు చెప్పుతూ.. ఈ చిన్నారి పాప మీకు డై హార్ట్ ఫ్యాన్ సామ్..మీరు ఖచ్చితంగా ఓ సారీ మీట్ అవ్వండి అంటూ సలహా ఇచ్చింది. ఇక సమంత ఇప్లై ఇస్తూ..ఎవరు ఈ క్యూటీ పై అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం అటు కీర్తి సురేష్ ఇటు సమంత ఇద్దరు చేతినిండా సినిమాలతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే.