నరేష్ మూడు పెళ్లిళ్లు ఏ కారణం చేత చేసుకోవాల్సి వచ్చింది?

సినిమా వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న విషయాలను చూస్తే ఒక్కో సారి అభిమానులకే కాదు, సగటు మనుషులకు కూడా చిర్రెత్తుతుంది. చాల మంది సెలబ్స్ ఒకటి కాదు రెండు కాదు మూడేసి పెళ్లిళ్లు చేసుకున్న వారి జీవితాల్లో నిలకడ మాత్రం ఉండటం లేదు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే .. అలనాటి స్టార్ హీరోయిన్ విజయ నిర్మల తన మొదటి భర్తను వదిలేసి సినిమాల్లోకి వచ్చింది. సినిమాల్లో నటిస్తూనే క్రిష్ణను
ప్రేమించి పెళ్లి చేసుకుంది. అటు సూపర్ స్టార్ క్రిష్ణ తన మొదటి భార్య ఇందిరా దేవి కి తెలియకుండా విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. విజయనిర్మలకు, ఆమె మొదటి భర్తకు ద్వారా కలిగిన సంతానమే సీనియర్ హీరో నరేష్. ఆయనే జంబలకిడిపంబ నరేష్. అంతటితో ఆగిందా అంటే.. లేదు అనే చెప్పుకోవాలి. నరేష్ ఇప్పటికి ముగ్గుర్ని పెళ్లి చేసుకుని వదిలేశాడు. ప్రస్తుతం ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుతో కలిసి ఉంటున్నాడు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. తాజాగా నరేష్ మాజీ భార్య కారణంగా తను మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇంతకీ ఆమె చేసిన ఘనకార్యమేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నరేష్ మూడో మాజీ భార్య రమ్య రఘుపతి. ఈమె మరెవరో కాదు. మాజీ రాజకీయనాయకుడు రఘువీర రెడ్డి కి స్వయానా తమ్ముడి కూతురు. ఆమెకు పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు యాభయేళ్లు దాటి, రెండు సార్లు విడాకులు తీసుకున్న నరేష్ ని ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. పెళ్లి చేసుకున్న రెండేళ్లకే తను నరేష్ నుంచి విడిపోయింది. రమ్య కి సినిమ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. నరేష్ ని పెళ్లి చేసుకున్నాక విజయ నిర్మల దగ్గర కూడా కొన్నాళ్ళు అసిస్టెంట్ దర్శకురాలిగా వర్క్ చేసింది. ఇక ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే.

పెళ్ళై భర్త నుంచి విడాకులు తీసుకున్న అటు రమ్య కానీ ఇటు నరేష్ కానీ తమ విడాకుల విషయం బయటకు పొక్కకుండా కొన్నేళ్లుగా బాగానే మానేజ్ చేస్తూ వచ్చారు. ఇండస్ట్రీ లో మూడు పెళ్లిళ్లు పెటాకులు అంటే పరువు పోతుంది అనుకున్నాడేమో నరేష్ కానీ ఆ విషయాన్ని రమ్య తనకు కావాల్సిన పనుల కోసం బాగానే వాడుకుంది. దాంతో ఆమె పెద్ద పెద్ద ఖిలాడీ పనులే చేసింది. నరేష్ ఆయన తల్లి విజయ నిర్మల పేరు చెప్పి.. పలువురి దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడింది. తాజాగా ఆమె మీద గచ్చిబౌలి పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. కొంత మంది బాధిత మహిళలు కంప్లైంట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ విషయం గురించి నరేష్ స్పందించారు. ఆమెకు తనకు ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని వెల్లడించాడు. ఆమెతో 5 ఏండ్ల క్రితమే విడిపోయిన్లు చెప్పాడు. ప్రస్తుతం తనతో ఎలాంటి సంబంధం లేదన్నాడు.

నరేష్.. విజయ నిర్మలకు ఆమె తొలి భర్తకు కలిగిన కుమారుడు. ఈయనకు ఇప్పటి కే మూడుసార్లు పెళ్లి అయ్యింది. తొలుత విజయ నిర్మల ఓ సంబంధాన్ని చూసి పెళ్లి చేసింది. తను సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తె. వీరికి ఓ బాబు పుట్టాడు. పేరు నవీన్. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో వివాహం చేసుకున్నాడు. అది కూడా కొంత కాలానికి పెటాకులు అయ్యింది. ఆ తర్వాత ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. కొంత కాలం తర్వాత వీరు కూడా విడిపోయారు. అయితే తను నరేష్ తో కలిసి ఉన్నప్పుడు నరేష్ పేరు, అత్త విజయ నిర్మల పేరు చెప్పి పలువురి దగ్గర డబ్బులు తీసుకుందట. ఎంతకీ తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.

ఏది ఏమైనా నరేష్ కి అస్సలు పెళ్లిళ్లు అచ్చి రావడం లేదు. మొదటి రెండు విడాకులకు పెద్దగా కారణాలు బయటకు పొక్కలేదు కానీ, రమ్య రఘు పతి విషయం లో మాత్రమే ఆమె చేసిన ఫైనాన్సియల్ వ్యవహారాల కారణంగానే విడాకులు తీసుకున్నానని నరేష్ ఒక వీడియో లో చెప్పి రిలీజ్ చేసాడు.

Share post:

Latest