ఒక సినిమా హిట్ అవ్వాలి అన్నా..ఆ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడాలి అన్నా హీరో హీరోయిన్లే ముఖ్యం. తెర పై కొన్ని జంటలు చూడటానికి భలే ఉంటారు. అచ్చంగా నిజ జీవితంలో ఉండే భార్య భర్తల లానే నటిస్తూ..ప్రేక్షకులను అలరిస్తారు. అలా తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది రీల్ కపూల్స్ ఉన్నారు. చిరంజీ-శ్రీదేవి, వెంకటేష్-సౌందర్య, తరుణ్-ఆర్తి అగర్వాల్..ఇలా కొన్ని జంటలు తెర పై కనిపిస్తే ఆ సినిమా హిట్టే అంటారు అభిమానులు..రిజల్ట్ కూడా అలానే ఉండేదిలేండి.
అయితే ఈ కాలంలో అలా పేరు తెచ్చుకున్న జంట కాజల్-చరణ్. వీళ్లిద్దరు కలిసి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మగధీర అనే సినిమాలో ఫస్ట్ టైం జంట గా కనిపించారు. ఈ సినిమాలో ఇద్దరి నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో రాణీ మిత్ర వింద గా కాజల్ లుక్స్ అదుర్స్ అనే చెప్పాలి. ఇక ఆ రాజ్యానికి రక్షక భటుడిగా చరణ్..ఆయన పలికించిన ఎక్స్ ప్రేషన్స్ ..మిత్రవింద ని చూసిన్నప్పుడు ఆ కళ్ళలో చూపే ప్రేమ.. పడిపోతున్నప్పుడు కనిపించే బాధ..అబ్బో ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.
ఈ సినిమా తరువాత కాజల్ రేంజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఈ సినిమా తరువాతే అమ్మడుకి స్టార్ హీరో సినిమాలల్లో అవకాశాలు ఇచ్చారు. అలా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ళు ఏలేసింది ఈ మిత్రవింద. అయితే ఈ సినిమా షూటింగ్ టైం లో కాజల్ అనే పేరుతో చాలా ఇబ్బందులు పడ్డాను అని మెగా హీరో తాజాగా పాల్గోన్న ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. చరణ్ కి జంతువులు అంటే ఇష్టం. ఆయన దగ్గర చాలా జంతువులు ఉంటాయి. ఇక మగధీర సినిమా షూటింగ్ టైంలో తన దగ్గర ఉన్న రెండు గుర్రాలని సినిమాకోసం వాడుకున్నారు. అయితే ఆ గుర్రాళల్లో ఒక దాని పేరు కాజల్. ఆ గుర్రం కళ్లు మొత్తం నల్లగా ఉండడంతో ముద్దుగా కాజల్ అని పిల్చుకుంటాం. మగధీర సినిమా షూటింగ్ టైంలో కాజల్ హీరోయిన్గా రావడంతో ఈ గుర్రాన్ని కాజల్ అని పిలిచేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చరణ్-తారక్ కలిసి నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది.