బాప్‌రే..1000 కోట్లా..ప్రభాస్ నువ్వు మామూలోడివి కాదయ్యో..!

టాలీవుడ్ లోకి ఈశ్వర్ అనే సినిమాతో హీరో గా ఎంటర్ అయ్యి..తనకంటూ ఓ సపరేటు ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. నిజానికి కృష్ణం రాజు పేరు చెప్పుకుని ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా..ఏ నాడు కూడా ఆయన క్రేజ్ ని పలికుబడిని వాడుకుని సినిమా అవకాశాలు దక్కించుకోలేదు. కష్టమో నష్టమో తనకు తానే పడుతూ..పై పైకి ఎదిగాడు. ఈ క్రమంలోనే కెరీర్ మొదట్లో ఆయన ఖాతాలో చాలా ఫ్లాప్ సినిమాలు పడ్డాయి.

కానీ ఫ్లాప్ సినిమాలు పడ్డాయని ప్రభాస్ ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదట, తన మీద తనకు ఆ నమ్మకం ఉందట. ఎప్పటికైన టాలీవుడ్ లో మంచి హీరో పేరు తెచ్చుకుంటానని. కానీ ఇప్పుడు ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన పేరు తెలియని వారంటూ ఉండరు. అమ్మాయిల కలల రాకుమారుడిగా తన అందంతో స్మైల్ తో ఫిజిక్ తో వాళ్ళ మనసు దోచుకుంటున్నాడు. అయితే బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. పెట్టే బడ్జేట్ లోను..తీసుకునే రెమ్యూనరేషన్ లోను రెండింటిలో మార్పులు వచ్చాయి.

ఇప్పుడు ఒక్కో సినిమాకి ప్రభాస్ 150 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడు అని టాక్ వినిపిస్తుంది. అలాగే ఆయన చేసే సినిమాల బడ్జేట్ లు కూడా అలానే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న అన్నీ సినిమాల బడ్జేట్ చూసుకుంటే ..మొత్తంగా 1000 కోట్లు దాటిపోతుందట. ముఖ్యంగా ప్రభాస్ కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కలయికలో వస్తున్న చిత్రం ‘సలార్‌’ కి అయితే అనుకున్న బడ్జేట్ మీద డబుల్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సలార్ మూవీ కి అనుకున్న బడ్జేట్ 120-150 కోట్లలోపు ఫినీష్ చేయాలి అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆ బడ్జేట్ ఏకంగా 220 కోట్లు దాటేసిందట. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసమే చాలా కోట్లు ఖర్చు చేసిన్నట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాదు పెట్టిన డబ్బులు తిరిగి రావాలంటే..ఖచ్చితంగా సలార్ ని రెండు పార్ట్లు గా రిలీజ్ చేయండి అంటూ పలువురు సినీ విశ్లేషకులు మేకర్స్ కి సలహా ఇస్తున్నారు. మరి చూడాలి నిర్మాతలు ఏం చేస్తారో..?

Share post:

Popular