కోట్లు ఇచ్చినా ఆయన డైరెక్షన్ లో మాత్రం చేయను..పూజాకు ఆయన అంటే అంత కోఫం ఎందుకో..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు అంటుంటే ఏమో అనుకున్నాం..కానీ పూజా హెగ్డే ని చూసాక అదే నిజం అనిపిస్తుందని అంటున్నారు నెటిజన్స్. ఒకప్పుడు పూజా హెగ్డే ను చూసి డైరెక్టర్లు భయపడిపోయే వారు. ఆమె తో సినిమా చేస్తే భారీ ఫ్లాప్ పడుతుందని నమ్మేవారు. అప్పట్లో అమ్మడు టైం అలానే నడిచింది. ఎంత పెద్ద స్టార్ హీరోతో నటించిన ఆ సినిమా మాత్రం హిట్ అయ్యేది కాదు..అంతేనా పరమ చెత్త సినిమాగా టాక్ తెచ్చుకునేది.

ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాల ఆమెకు నిరాశేనే మిగిల్చాయి. దీంతో అమ్మడుకి ఐరెన్ లెగ్ అనే తోకను తగిలించారు. అయినా పూజా వెనకడుగు వేయలేదు, తన టాలెంట్ ను నమ్ముకుని వచ్చిన స్టోరీలల్లో నచ్చి కధలను చూస్ చేసుకుంటూ ఫైనల్ గా హిట్ సినిమా అయితే కొట్టింది. ఇక అమ్మడు జాతకం లో శుక్ర మహాదశ స్టార్ట్ అయ్యింది. చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం..పూజా పాత్రకు మంచి పేరు రావడం..సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుండడంతో..ఆ నిర్మాతల పాలిట పూజా అదృష్ట దేవతగా మారిపోయింది.

సీన్ కట్ చేస్తే ఒక్కప్పుడు అమ్మడుని చూసి బయపడుతున్న వాళ్లే నేడు అమ్మడుకి పిలిచి అవకాశం ఇస్తున్నారు..పూజా కాల్ షీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక అలా తనను ఒకప్పుడు అవమానించిన డైరెక్టర్ నే ఇప్పుడు పూజా కోసం పడిగాపులు కాస్తున్నారట. బాలీవుడ బడా డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఓ దర్శకుడు..ఒకప్పుడు పూజా తో సినిమా చేద్దామని అన్ని మాట్లాడుకుని..తీరా హృతిక్ రోషన్ నటించిన మొహెంజో దారో అనుకున్నంత విజాయాని సాధించక పోవడంతో అమ్మడు తో తెరకెక్కించాల్సిన ప్రాజెక్ట్ ను వేరే హీరోయిన్ పెట్టి కంప్లీట్ చేశాడట. ఆ టైంలో బాధపడిన పూజా..ఇప్పుడు అదే డైరెక్టర్ తన సినిమాలో నటించమని కాల్ షీట్లు ఇవ్వమని అడుగుతున్నారట. అయితే పూజా మాత్రం ఎట్టి పరిస్ధితిలోను నటించడానికి ఒప్పుకోలేదట. మేకర్స్ భారీ స్దాయిలో రెమ్యూనరేషన్ ఇస్తాం అని ఆఫర్ చేసినా..ఎన్ని కోట్లు ఇచ్చినా ఆయన డైరెక్షన్ లో చేయను అంటూ తేల్చి చెప్పిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వద్దని వదిలేసి పోయిన వాడు మళ్లీ తిరిగి వస్తే ఆ కీకే వేరు అంటూ పూజా అభిమానులు ఆ డైరెక్టర్ కి కౌంటర్లు వేస్తున్నారు.

Share post:

Latest