ప్రభాస్ పాన్ ఇండియా దర్శకుడితో పవన్..కల”సి”వచ్చేనా..?

పవన్ కళ్యాణ్..ఓ పక్క రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోపక్క సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీ గా గడిపేస్తున్నారు. ఆయన రీసెంట్ గా హీరోగా నటించి విడుదలైన చిత్రం.. “భీమ్లా నాయక్”. సాగర్ చంద్ర డైరెక్షన్ లో వచ్చినా ఈ సినిమాలో..రానా దగ్గుబాటి విలన్ గా నటించగా..నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫిస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఈ సినిమా ఇంత బాగా పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడానికి కారణం..త్రివిక్రమ్ , తమన్..అని చెప్పక తప్పదు. ఈ సినిమా విజయంలో వాళ్లు కీలక పాత్ర పోషించారు.

అయితే ఈ సినిమా తరువాత పవన్ వరుస పెట్టి సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. క్రిష్ డైరెక్షన్ లో ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’..ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌పై ఉంది. మరోవైపు హ‌రీష్ శంక‌ర్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇవే కకుండా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తో కూడా ఓ సినిమా కు కమిట్ అయ్యి వెయిటింగ్‌ పెట్టాడు. పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటూ ఈ సినిమాలు కంప్లీట్ చేసే సరికి చాలా టైం పడుతుంది. అయితే , తాజా గా పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అది కూడా రీమేక్ సినిమా కావడం విశేషం. కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి హీరో విజ‌య్ న‌టించిన ‘తెరి’ సినిమా అక్కడ రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ స్టోరీని ఎప్పటినుండో తెలుగులో రీమేక్ చేయాలి అనుకుంటున్నారు మన తెలుగు హీరోలు. ఫైనల్ గా ఆ అవకాశం పవన్ కి దక్కిన్నట్లు తెలుస్తుంది. వినోద‌య సీత‌మ్ తెరకెక్కించిన ఈ చిత్రాని తెలుగులో పవన్ ఆయన మేన‌ల్లుడు సాయి ధరమ్ తేజ్ తో క‌లిసి నటించబోతున్నారంటూ ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. అయితే ఈ చిత్రాని ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘సాహో’ డైరెక్టర్ ద‌ర్శ‌కుడు సుజిత్‌ తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల దగ్గరనుండి టాక్ వినిపిస్తుంది. కాగా ఈ మూవీ ని ప్ర‌ముఖ నిర్మాత డివివి దాన‌య్య నిర్మించ‌బోతున్నారట. ఒకవేళ ఇదే నిజ‌మైతే మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో మనల్ని మెప్పించనున్నారు. కానీ, కధలో ఏం తేడాలు వచ్చినా పవన్ ని సరిగ్గా చూయించలేకపోయినా..ఈ చిత్రం మరో సాహో లా అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Share post:

Popular