“శుక్రవారం వచ్చి సంతకం పెట్టి వెళ్లరా నాకొడకా”.. పవన్ పంచ్ డైలాగ్ ఎవ్వరికబ్బా..?

“భీమ్లా నాయక్”..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నిన్న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజై ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ధియేటర్స్ బయట పవన్ ఫ్యాన్స్ రచ్చ, ధియేటర్ లోపల అభిమానుల కేకలు, అరుపులు, విజిల్స్ .. ఇదంతా చూస్తుంటే ఓ పండగలా అనిపిస్తుంది.

ఈ సినిమా కోసం పవన్ అభిమానులే కాదు బడా బడా బిగ్ స్టార్స్ కూడా వెయిట్ చేశారు. ఫైనల్ గా సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి ఓకరు కూడా సినిమా అద్దిరిపోయింది. పవన్ ఇరగదీశాడు ..రానా చించేశాడు..ఇక త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ అయితే మైండ్ బ్లాకింగ్..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ నోటి నుండి పవర్ ఫుల్ డైలాగ్స్ వస్తాయని..అవి ఓ వర్గం వాళ్లకి పరోక్షంగా తగిలేలా ఉన్నాయని..పవన్ ని అభిమానించే ప్యాన్స్ అంటున్నారు.

సినిమా చూసి వచ్చాక .. భీమ్లా నాయక్ సినిమాలోని పలు డైలాగ్స్ ని చెప్పుతూ..పోస్ట్ చేస్తూ..పవన్ అన్న పవర్ ఫుల్ డైలాగ్స్ అంటూ ట్వీట్టర్ ద్వార పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ సినిమాలో ఓ సన్నీ వేశంలో రానా ను పవన్ కళ్యాణ్..ప్రతి “శుక్రవారం వచ్చి సంతకం పెట్టి వెళ్లరా నాకొడకా” అంటూ ఓ డైలాగ్ ఉంటుందని..ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ధియేటర్స్ లో అరుపులు ఈలలు గోలలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందని పవన్ అభిమాని రాసుకొచ్చాడు. ఇక దీని పై కొందరు అభిమానులు ఈ డైలాగ్ పవన్ సినిమాలో రానా కే చెప్పినా.. నిజ జీవితంలో మాత్రం..ఎవరికో గట్టిగా తగ్గిలేలానే రాశారు త్రివిక్రమ్..ఎంతైనా మాటల మాంత్రికుడు కదా..ఏమైనా మాయ చేస్తాడు ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు అయితే పవన్ ఈ పంచ్ డైలాగ్ ఎవ్వరికేసుంటారు అంటూ ఫన్నీ ఎమోజీ తో షేర్ చేస్తున్నాడు. మొత్తానికి భీమ్లా నాయక్ బొమ్మ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Share post:

Popular