ప‌వ‌న్ చేయాల్సింది ఏంటి… చేస్తోంది ఏంటి…?

రాజ‌కీయాలు డిఫ‌రెంట్‌గా ఉండొచ్చు. కానీ, ప్ర‌జ‌లు ఇప్పుడు అన్నీ గ‌మ‌నిస్తున్నారు. ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో.. ఎవ‌రు ఎలా మా ట్లాడుతున్నారో.. అన్నీ వారికి ఎరుక‌లోకి వ‌చ్చేస్తోంది. స్మార్ట్ ఫోన్ పుణ్య‌మా అని.. అన్ని సంగ‌తులు వారికి తెలిసిపోతు న్నాయి. దాచాలంటే.. దాగ‌దులే.. అనేది ఇప్పుడు అక్ష‌ర స‌త్యంగా మారిపోయింది. ఎవ‌రెవ‌రి పంథా ఏంటి? ఎవ‌రు ఏం చేస్తున్నారు? అనే విష‌యాల‌ను ప్ర‌జ‌లు బాగానే అర్ధం చేసుకుంటున్నారు. ఇదే విష‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కూడా వారు కార్న‌ర్ చేస్తున్నారు. అన్ని రోజులు ఒకేవిధంగా ఉండ‌వు క‌దా! అలానే ప్ర‌జ‌లు కూడా త‌మ మైండ్ సెట్ మార్చుకుంటున్నారు.

ఎన్నిక‌లకు మ‌రికొంత గ‌డువు ఉందిక‌దా! అని నేత‌లు తొంగుంటే.. ప్ర‌జ‌లు అమాయ‌కులు కాదు చూస్తూ.. ఉండ‌డానికి అని మేధావులు కూడా అంటున్నారు. దీనికి కార‌ణం ఏంటంటే.. ప్ర‌స్తుతం పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని.. విభ‌జ‌న‌తో ఏపీ న‌ష్ట‌పోయింద‌ని.. తెలంగాణ కూడా అన్యాయం పాలైంద‌ని సాక్షాత్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పార్ల‌మెంటులోనే చెప్పుకొచ్చారు. ఇక‌, ఇన్ని చెప్పిన పెద్ద‌మ‌నిషి.. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకికానీ, తెలంగాణ‌కు కానీ.. పైసా విద‌ల్చ‌లేదు. దీనిని ప్ర‌శ్నించేందుకు ఇరు రాష్ట్రాల ఎంపీలు నడుంబిగించారు. త‌మ‌తమ స్థాయిలో పోరాటాలు చేసేందుకు రెడీ అయ్యారు.

అయితే.. బీజేపీతో జ‌ట్టుక‌ట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఈ విష‌యంలో సైలెంట్‌గా ఉన్నారు. ప్ర‌ధాని అంత‌టి వాడు.. రెండు రాష్ట్రాల‌కూ అన్యాయం జ‌రిగింద‌ని చెప్ప‌గానే .. అంద‌రూ ప‌వ‌న్ వైపు చూశారు. ఎందుకంటే.. ఎలాగూ.. బీజేపీ నేత‌లు అడ‌గ‌రు. త‌న‌కు .. కేంద్రంలో ప‌ర‌ప‌తి ఉంద‌ని. కేంద్రం పెద్ద‌లు.. త‌న‌కు కుర్చీ వేసి కూర్చోమంటార‌ని.. అదే జ‌గ‌న్ వెళ్తే.. అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌ర‌ని.. గ‌తంలో ఆయ‌న చెప్పుకొన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌పై ప‌వ‌న్ ముందుగా స్పందిస్తార‌ని.. స‌రే.. రెండు రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రిగింద‌ని అంటున్నారు క‌దా.. మ‌రి మీరైనా న్యాయం చేయండి మోడీ జీ! అని ప్ర‌శ్నిస్తార‌ని.. అన్ని వ‌ర్గాలు ఎదురు చూశాయి.

అటు తెలంగాణ ఇటు ఏపీ ప్ర‌జ‌లు కూడా ప‌వ‌న్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. ప‌వ‌న్ మాత్రం ఏమాత్రం దీనిపై చ‌లించ‌లేదు. అంతేకాదు.. దేశం మొత్తం.. ప్ర‌ధాని ప్ర‌సంగం విన్నా.. ప‌వ‌న్ మాత్రం విన‌న‌ట్టే న‌టించారని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆయ‌న పోరాటం చేయాల్సిన అవ‌స‌రం లేదు. రోడ్డు కూడా ఎక్కే ప‌నిలేదు. కేవ‌లం ఒక లేఖ రాసి.. కేంద్రానికి పంపించి ఉంటే.. ఆ ఇమేజ్ వేరేగా ఉండేద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో బ‌డ్జెట్‌లో జ‌రిగిన అన్యాయాన్ని కూడా ప్ర‌శ్నించి ఉంటే.. బాగుండేద‌ని.. కానీ.. ప‌వ‌న్ మౌనం ఆయ‌న‌కే అన‌ర్థ‌మ‌ని.. రేపు ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతార‌ని.. బీజేపీతో అంట‌కాగుతూ.. కూడా ఏపీ , తెలంగాణ‌ల‌కు న్యాయం చేయ‌లేదంటే.. ఏం స‌మాధానం ఇస్తార‌ని మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు.


Leave a Reply

*