ఆ విషయంలో మహేష్ బాబు ది బెస్ట్..దండం పెట్టిన తప్పులేదు..?

రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ దిశగా దూసుకుపోతుంది. రానా దగ్గుబాటి విలన్ గా నటించిన ఈ చిత్రాని సాగర్ చంద్ర తనదైన డైరెక్షన్లో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ తమన్ మ్యూజిక్..త్రివిక్రమ్ డైలాగులు. ఈ రెండింటి మధ్య పవన్ రానా ను తెర పై చూసిన ప్రతి ప్రేక్షకుడు కళ్లారా ఎంజాయ్ చేశాడు అంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా భీమ్లానాయక్ సాంగ్ వచ్చేటప్పుడు ఫ్యాన్స్ తమ సీట్లల్లో కూర్చో వట్లేదట. అరుపులు కేకలతో రచ్చ రచ్చ చేస్తున్నారట. ఈ సినిమా సూపర్ హిట్ అంటూ పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెబుతున్నారు. అలాగే ఈ సినిమా పై పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా తమదైన స్టైలో స్పందిస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమా పై మహేష్ ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ..చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

ఈ మేరకు ఆయన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో..”పవర్ స్టార్ తన ఎనర్జిటిక్, ఫైరింగ్ యాక్టింగ్ తో అదరగొట్టేశారు ఇక రానా డానియల్ శేఖర్ గా తనలోని విశ్వరూపాని చూపించారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ బాగున్నాయని.. ఎప్పటిలానే అద్భుతంగా రాశారని.. చెప్పుకొస్తూ విజువల్స్ గా కూడా అద్భుతంగా ఉందని.. తమన్ సంగీతం ఈ సినిమాలో చాలా బాగుందని మహేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. దీంతో అటు మహేష్ అభిమానులు, ఇటు పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమాకు పవన్ అభిమానులు ఆల్ ది బెస్ట్ చెప్పుతున్నారు. ఇక మహేష్ ఇలా మిగతా హీరోల సినిమా ను పొగుడుతూ ట్వీట్ చేయడం ఇదేమి కొత్త కాదు. మహేష్ కు ఆ సినిమా నచ్చితే ఖచ్చితంగా ఇలానే చేస్తాడు. ఇప్పటికే ఇలా ఆయన అభినందించడం మనం చాలా సార్లు చూశాం దీంతో ఈ విషయంలో మహేష్ ది బెస్ట్ అంటున్నారు. ఇలాంటి వ్యక్తికి చేతులు ఎత్తి దండం పెట్టిన తప్పులేదు అంటున్నారు అభిమానులు.

Share post:

Popular