ఏపీ కేబినెట్లో కృష్ణాలో ఎవ‌రు అవుట్‌.. ఎవ‌రు ఇన్‌..!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మే నెల చివ‌రి నాటికి ఖ‌చ్చితంగా కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేయ‌నున్నారు. ఈ యేడాది జూన్ 8వ తేదీ నాటికి మంత్రి వ‌ర్గం ఏర్ప‌డి మూడు సంవ‌త్స‌రాలు అవుతోంది. ఈ తేదీకి కాస్త ముందుగానే మంత్రి వ‌ర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయ‌న్న ప్ర‌చారంతో వైసీపీ నేత‌లు జిల్లాల వారీగా ఎలెర్ట్ అవుతున్నారు. కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో కొత్త‌గా ఎవ‌రు కేబినెట్లోకి వ‌స్తారు ? ఎవ‌రు అవుట్ అవుతారు ? అన్న‌దానిపై జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. ప్ర‌స్తుతం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు.

కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాగా విజ‌య‌వాడ కేంద్రంతో ఓ జిల్లాగాను, బంద‌రు కేంద్రంగా కృష్ణా జిల్లాగాను అవ‌త‌రించింది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ముగ్గురూ కూడా అగ్ర‌వ‌ర్ణానికి చెందిన మంత్రులే..! అయితే ఇప్పుడు ఎస్సీ, బీసీ నేత‌లు కూడా కేబినెట్లో చోటు కోసం ట్రై చేస్తున్నారు. బీసీ కోటాలో పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌, మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి ట్రై చేస్తున్నారు.

ఇక ఎస్సీ కోటాలో రెండు సార్లు గెలిచిన తిరువూరు ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధి రేసులో ఉన్నారు. కాపు కోటాలో జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను మంత్రి ప‌ద‌వి కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే పేర్ని నాని కాపు కోటాలో మంత్రిగా ఉన్నారు. ఆయ‌న్ను కంటిన్యూ చేయాల‌నుకుంటే ఉద‌య‌భానుకు క‌ష్ట‌మే అవుతుంది. ఇక క‌మ్మ కోటాలో కొడాలి నానిని త‌ప్పించ‌రంటే త‌ప్పించ‌ర‌నే అంటున్నారు. ఆయ‌న అవ‌స‌రం సీఎం జ‌గ‌న్‌కు ఎంతో ఉంది. ఆ ఫైర్‌బ్రాండ్‌ను కేబినెట్లో వ‌దులుకోలేర‌నే టాక్ ?

ఇక వెల్లంప‌ల్లి శ్రీనివాస్ పేరు ముందుగా అవుట్ లిస్టులో ఉంది. ఇక సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు బ్రాహ్మ‌ణ కోటాలో ట్రై చేస్తున్నా.. ఆయ‌న‌కు ప‌ద‌వి రావ‌డం డౌటే ? ఈ కులంకోటాలో ఎవ‌రికి అయినా మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని అనుకున్నా విష్ణు కంటే సీనియ‌ర్ అయిన బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి ముందు వ‌రుస‌లో ఉంటారు. ఏదేమైనా కేబినెట్ ప్ర‌క్షాళ‌న కృష్ణా వైసీపీ నేత‌ల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.