నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా న్యూలుక్ సోమవారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఎన్ బికె 107 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య చేస్తోన్న సినిమా కావడంతో పాటు అటు క్రాక్ లాంటి సూపర్ హిట్ కొట్టాక దర్శకుడు మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో మరో సూపర్ హిట్ అవుతుందన్న అంచనాలు అయితే అప్పుడే స్టార్ట్ అయ్యాయి.
ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ సందర్భంగా బాలకృష్ణ ఫోటో లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చిత్ర యూనిట్ అధికారికంగానే ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. బాలయ్య మైనింగ్ ఏరియాలో నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని స్టైలిష్ గా ఇంటెన్స్ గా నడుచుకుంటూ వస్తోన్న స్టిల్ అదరగొట్టేసింది. అలాగే పంచెకట్టులో బ్లాక్‌షర్ట్ ధరించి చాలా కొత్త గెటప్‌లో ఉన్నాడు. నుదట బొట్టు, ఓ చేతికి వాచ్, మరో చేతిలో రుద్రాక్ష మాల ధరించి మిడిల్ ఏజ్ క్యారెక్టర్లో కనిపిస్తున్నట్టు ఉన్నాడు.
ఇక ఈ సినిమాపై యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కామెంట్ చేశాడంటూ ఓ కామెంట్ వైరల్ అవుతోంది. హంట్ బిగైన్స్ అంటూ బాలయ్య ఫస్ట్ లుక్ స్టిల్‌పై ఆ కామెంట్ కనిపిస్తోంది. దీంతో ఆ కామెంట్‌ను నందమూరి అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వాస్తవంగా అది ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్.. ఆ పేజ్‌లో ఎవరో అభిమాని ఎన్టీఆర్ పేరుతో ఈ కామెంట్ పెట్టారు. ఒకవేళ నిజంగానే బాబాయ్ ఫస్ట్ లుక్‌పై తారక్ కామెంట్ చేస్తే ఆ కామెంట్ ఎంత హైలెట్ అయ్యేదో చెప్పక్కర్లేదు.
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దునియా విజయ్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.