వావ్: ఎన్టీఆర్ బావమరిది సినిమా టైటిల్ చూసారా..అద్దిరిపోయిందిగా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి యంగ్ టైగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో, నటన తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన..ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ గా ఉన్నాడు. అయితే , సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులు వచ్చి..తమలోని టాలెంట్ చూయించి సత్తా చాటుతున్నారు.. ఇక తాజాగా ఆ లిస్ట్ లో మరో వారసుడు కూడా వచ్చేస్తున్నాడు. ఆయన మరెవరో కాదు నందమూరి యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నితిన్‌ చంద్ర. యస్..ప్రముఖ వ్యాపారవేత్త – రాజకీయ నాయకులు నార్నే శ్రీనివాసరావు కుమారుడు నితిన్ చంద్ర ఇప్పుడు హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

నార్నే శ్రీనివాసరావు కుమారుడు తారక్ భార్య లక్ష్మీప్రణతి తమ్ముడైన నితిన్.. కుటుంబ కథా చిత్రాల డైరెక్టర్ సతీష్ వేగ్నేశ చేతుల మీదుగా లాంచ్ చేయబడుతున్నాడని తెలుస్తుంది. సతీష్ వేగ్నేశ గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఫ్యామిలీ స్టోరీలను తెరకెక్కించడంలో ఆయనకు లేరు సాటి. ఈ క్రమంలోనే ఈ సినిమా బాధ్యతలను తారక్ దగ్గరుండి చూసుకుంటున్నారట. నిజానికి ఈ సినిమాకు డైరెక్టర్ గా సతీష్ అయితే బాగుంటాడు అని చెప్పింది కూడా తారక్ నే అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ..నితిన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు ఓ వార్త లీక్ అయ్యింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదొక ఫ్యామిలీ డ్రామా అని..ఫుల్ కామెడీ ఉంటుందని..మిడిల్ క్లాస్ వాళ్లకి బాగా కనెక్ట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘తీవండి’ ఆధారంగా తెరకెక్కించారట. అయితే…కధలో కొన్ని మార్పులు చేసి..మన తెలుగు నేటివిటీకి దగ్గరగా..కొన్ని సీన్స్ మార్చీ .. చక్కటి కధను తెరకెక్కించారట సతీష్. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా..ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని…అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. మరి చూడాలి ఎన్టీఆర్ బావమరిది ఈ సినిమా ద్వారా ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో..?

Share post:

Popular