భీమ్లానాయ‌క్ రిలీజ్‌.. రానా ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారుగా…!

మొత్తానికి భీమ్లానాయ‌క్ ఈ రోజు థియేటర్ల‌లోకి వ‌చ్చేశాడు. అయితే కొన్ని చోట్ల ప‌వ‌న్ ఫ్యాన్స్ డామినేష‌న్‌, హంగామా దెబ్బ‌తో రానా ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారు. అస‌లు బాహుబ‌లి రిలీజ్ టైంలోనే ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ధీటుగా రానా, వెంకీ, ద‌గ్గుబాటి అభిమానులు కూడా ఎక్క‌డా త‌గ్గ‌కుండా గ‌ట్టిగానే హంగామా చేశారు. అయితే భీమ్లానాయ‌క ్‌విష‌యంలో మాత్రం రానా ద‌గ్గుబాటి అభిమానుల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప‌రిస్థితి కాస్త సీరియ‌స్ అయ్యింది.

చాలా చోట్ల బెనిఫిట్ షోలు, ప్రీమియ‌ర్ షోల టిక్కెట్లు అన్నీ కూడా ప‌వ‌న్ అభిమానులు, మెగా అభిమానుల‌కే ఇచ్చేశారు. కొన్ని షోలు కూడా వాళ్లే కొనేసుకున్నారు. థియేట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు రానా అభిమానుల‌ను పూర్తిగా విస్మ‌రించిన ప‌రిస్థితి. దీంతో వాళ్లు హ‌ర్ట్ అయ్యారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఇదే ప‌రిస్థితి కొన‌సాగింది. తాము చాలా ఏళ్లుగా ద‌గ్గుబాటి అభిమాన సంఘాల‌ను న‌డుపుతున్నా త‌మ‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేద‌ని వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

నెల్లూరు నగరంలో రానా ఫ్యాన్స్ టికెట్ల కోసం గొడవ చేస్తున్నారు. అన్ని టికెట్లు పవన్ ఫ్యాన్స్‌కేనా అని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. భీమ్లానాయ‌క్ సినిమాకు కేవ‌లం ఐదంటే ఐదు టిక్కెట్లు త‌మకు ఇచ్చార‌ని వారు వాపోతున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఇచ్చిన ప్రయార్టీ త‌మకు ఇవ్వ‌డం లేదంటూ వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు రానా, వెంకీ అభిమానులు ఈ విష‌యాన్ని చివ‌ర‌కు సురేష్‌బాబు వ‌ర‌కు తీసుకువెళ్లారు.

Share post:

Latest