హీరోయిన్ తో రొమాంటిక్ సాంగ్.. చూసిన భార్య షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది అంటున్న హీరో?

సాధారణంగా హీరోలు, హీరోయిన్ల తో రొమాంటిక్ సాంగ్ చేయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు దర్శకులను అడిగిమరీ రొమాంటిక్ సాంగ్ ఉంటే బాగుంటుందని పెట్టించుకుంటారు. ఇలా అడిగి మరీ రొమాంటిక్ సాంగ్ పెట్టించుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇలా రొమాంటిక్ సాంగ్ షూటింగ్ సమయంలోనే హీరోల భార్యలు షూటింగ్ స్పాట్ కి వస్తే ఎలా ఉంటుంది.. అమ్మో అది మాటల్లో చెప్పలేం.. భార్య ఎదురుగా ఉన్నప్పుడు రొమాంటిక్ సీన్లలో ఒదిగిపోయి నటించలేము అంటూ ఉంటారు కొంతమంది హీరోలు. పాపం ఇక్కడ ఒక హీరో కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట.. ఆ హీరో నేటి తరం హీరో కాదు లెండి నాటి తరంలో హీరోగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న హీరో వినోద్ కుమార్.

మౌన పోరాటం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వినోద్ కుమార్. మొదటి సినిమా పర్వాలేదనిపించింది. ఇక ఆ తర్వాత సీతారత్నం గారి అబ్బాయి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. బాగానే క్రేజ్ సంపాదించాడు. వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయాడు. ఇక ఆ తర్వాత హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇక పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన సత్తా చాటాడు. ఇక ఇప్పుడు తెలుగు వెండితెరపై హీరో వినోద్ కుమార్ కనిపించి చాలా రోజులు అవుతుంది.. ఇలా కనుమరుగైనా సెలబ్రిటీలను తెరమీదకు తీసుకు రావడమే పనిగా పెట్టుకున్న కమెడియన్ ఆలీ ఇటీవల వినోద్ కుమార్ ను తన షో ఆలీతో సరదాగా కార్యక్రమానికి పిలిచాడు.

ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగి.. ఎవరికి తెలియని విషయాలను బయట పెట్టేలా చేశాడు. ఒకరోజు మీ భార్య షూటింగ్ నుంచి వెళ్లి పోయిందట కదా అంటూ అని ప్రశ్నించగా.. ఆ విశేషాలను చెప్పుకొచ్చాడు వినోద్ కుమార్. అప్పటి హీరోయిన్ ఆమని తో రొమాంటిక్ సాంగ్ ఉన్న ఒక సినిమా షూటింగ్ సమయంలో తన భార్య షూటింగ్ జరిగే ప్లేస్ కి వచ్చిందని.. అయితే ఇక ఆమని తో రొమాంటిక్ సాంగ్ చేస్తున్న సమయంలో ఆ సీన్స్ చూడలేక తన భార్య షూటింగ్ స్పాట్ నుంచి వెళ్ళిపోయింది అంటూ వినోద్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇక నా భార్య అలా వెళ్లిపోవడంతో ఏం అర్థం కాలేదు అంటూ తెలిపాడు వినోద్ కుమార్..

ఇక తన ఆస్తుల గురించి మాట్లాడుతూ జీవితానికి కష్టం లేకుండా బాగానే సంపాదించానని, కోట్లి కూడబెట్టకపోయిన, తనకు తన కుటుంబానికి ఏ లోటు లేనంత ఉందంటూ చెప్పుకోచ్చాడు. ఇక మరో సందర్భంలో హీరో సాయి కుమార్ కొడదాం అనుకున్నానని బాంబు పేల్చాడు వినోద్ కుమార్. కర్తవ్యం సినిమా కోసం దుబ్బింగ్ చెప్పమని సాయి కుమార్ ని అడిగితే చెప్పలేదని ఆ సమయంలో బాగా కోపం వచ్చిందని వినోద్ కుమార్ చెప్పుకోచ్చాడు. ఇక వినోద్ కుమార్ కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. సినిమాల్లోకి రావాలని వారు కూడా తహతహలాడుతున్నారని వినోద్ కుమార్ ఒక సందర్భంలో చెప్పాడు.