బేబమ్మా బ్యాడ్ టైం స్టార్ట్.. కృతి పై గుర్రుగా ఉన్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్..?

అదృష్టం ఎవ్వరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు. అలా అనుకోకుండా వచ్చేస్తుంది. దానిని మనం కరెక్ట్ గా వినియోగించుకుంటే..లైఫ్ లో ఇక తిరుగుండదు. అలాంటి పనిలోనే బిజీ గా ఉంది లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి. అమ్మడు అదృష్టాని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుందో, బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతుందో తెలియదు కానీ..పట్టిందల్లా బంగారమే అన్నట్లు..చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ పోతుంది. ఇప్పటి వరకు కృతి చేసిన మూడు సినిమాలో బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయాని అందుకున్నాయి.

- Advertisement -

ఇక సినిమాలో అమ్మడు పర్ ఫామెన్స్ చూసిన ఏ డైరెక్టర్ అయినా ఆమెను వదులుతాడా..నో ఛాన్స్..ఆ విషయంలో మన డైరెక్టర్లకు ముందు చూపు ఎక్కువే. అమ్మడు కాల్ షీట్లు ఫిల్ అవ్వకముందే వాళ్ల సినిమాకి డేట్లు బుక్ చేసుకుంటారు. ఇక కృతి కూడా వయసుకు మించిన ముదురండోయ్. మంచి తెలివితేటలతో సినిమా స్టోరీ చూస్ చేసుకుంటూ..తనకు ఆ కధలో వాల్యు ఉండే పాత్రలనే చూస్ చేసుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే అమ్మడు మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ ను రిజెక్ట్ చేసింది.

మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఫిక్స్ చేసారు డైరెక్టర్. అయితే కధలో సెకండ్ హీరోయిన్ కూడా ఉందని..ఆ పాత్ర కోసం ఇప్పటికే సంయుక్తా మీనన్ ను సెలక్ట్ చేశారని వార్తలు వినిపించగా..రీసెంట్ గా అమ్మడు ఆ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు మ్యాటర్ లీక్ అయ్యింది. ఇక ఈ ప్లేస్ లోకి కుర్ర బ్యూటీ కృతి ని తీసుకుందాం అని ఆమెను అప్రోచ్ అవ్వగా సింపుల్ గా ఈ పాత్ర నాకు నచ్చలేదు..టైం పీరియడ్ చాలా తక్కువ..సారీ సార్ అంటూ మొహానే చెప్పేసిందట.

నిజానికి మొదటి నుండి త్రివిక్రం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేయాలి అంటే చాలా మంది భయపడతారు. ఆయన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తే కెరీర్ లో ఇంక క్లిక్ అవ్వలేం అని ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఇక కృతి కూడా అందుకే ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసుంటుందని అనుకుంటున్నారు నెటిజన్స్. దీంతో మహేష్ బాబు అభిమానులు కృతి పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. మా హీరో సినిమానే రిజెక్ట్ చేసే అంత పెద్ద దానివా నువ్వు అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కృతి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిన్నట్లేఉంది అంటున్నారు పలువురు ప్రముఖులు..?

Share post:

Popular