ఇండస్ట్రీకి ఆమె లేడీ పవన్ కళ్యాణ్..సుకుమార్ భజన మరీ టూ మచ్ గా లేదు..?

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. సినిమా టైటిల్ తోనే సగం మంది ఆడవాళ్ళను ఫిదా చేసేశారు డైరెక్టర్ కిషోర్ తిరుమల. మన ఇళ్లల్లో ,లైఫ్ లో ఆడవాళ్లు ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తున్నారని..సీరియస్ గా చూపిస్తూనే..సరదా గా ఫన్నీ గా డైలాగ్స్ పెట్టి ..చక్కటి ఆహ్లాదకరమైన సినిమా గా తెరకెక్కించిన్నట్లు ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమైపోతుంది. ఈ సినిమాలో యంగ్ హీరోహీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన జంటగా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్లు ఖుష్బు,రాధిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మార్చి 4వ తేదీన ఈ సినిమా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మెకర్స్ సిద్ధమైయారు. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధులుగా స్టార్ హీరోయిన్లైన కీర్తి సురేష్, సాయి పల్లవి లను గెస్ట్లుగా ఆహ్వానించారు. అదే విధంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

జనరల్ గా సుక్కుమార్ ఏ ఈవెంట్ లోను ఎక్కువుగా మాట్లాడరు. ఫార్మాలిటీకి నాలుగు ముక్కలు మాట్లాడేసి వెళ్లిపోతారు. కానీ ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ..హీరోయిన్ సమంత ను ఓ రేంజ్ లో పొగిడేశారు. ఇవన్నీ సమంత ఆ ఫంక్షన్ కి వచ్చి అక్కడ ఉండి ఉంటే సుక్కు చెప్పిన డైలాగ్స్ బాగుండేవి. కానీ సమంత ఆ ఫంక్షన్ లో లేదు. ఈ సినిమాకి ఆమెకి ఏ సంబంధం లేదు కానీ సమంతను అంతలా పొగిడేయటం..కొంచెం సమంత భజన లాగా అనిపిస్తుందట ఫ్యాన్స్ కి. అంతేకాదు హీరోయిన్ సాయి పల్లవి అయితే ఏకంగా ఆమె ఇండస్ట్రీకి లేడీ పవన్ కళ్యాణ్ అంటూ బిరుదు కూడా ఇచ్చేశారు. కాగా..వేదికపైకి వచ్చి మైక్ పట్టుకున్న సుకుమార్.. సమంతతో పాటు సాయి పల్లవి, రష్మిక, కీర్తి సురేష్‌లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన మాటలు వైరల్ గా మారాయి.

Share post:

Popular