‘భీమ్లా నాయక్’ పై హరీష్ శంకర్ మైండ్ బ్లోయింగ్ రివ్యూ..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన క్రేజీ మూవీ భీమ్లా నాయక్. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చిన ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు అదిరిపోయే టాక్ రావ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో ఎక్క‌డ చూసినా థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతున్నాయి. చాలా రోజుల త‌ర్వాత ప‌వ‌న్ నుంచి ప్యాక్డ్ పెర్పామెన్స్ వ‌చ్చింద‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు.

ఇప్పటికే ప్రీమియర్ షోల ద్వారా రికార్డు స్థాయిలో వసూళ్లని రాట్టిన భీమ్లా నాయక్ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ స్థాయిలో వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఫ‌స్ట్ డే వ‌సూళ్లు ఏ రేంజ్‌లో ఉంటాయ‌న్న‌దానిపై కూడా బాక్సాఫీస్‌, ట్రేడ్ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది. ఇక భీమ్లానాయ‌క్ సినిమాకు సూపర్ రెస్పాన్స్ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌తో గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన హ‌రీష్ శంక‌ర్ భీమ్లానాయ‌క్ సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న‌ రివ్యూ ఇచ్చేశారు. కొంచెం గ్యాప్ తరువాత గర్జించే పవన్ కల్యాణ్ ని చూశాను. దర్శకుడు సాగర్ చంద్ర త్రివిక్రమ్ పనితీరు అద్భుతం. నాగవంశీ అండ్ టీమ్‌కు శుభాకాంక్ష‌లు అని చెప్పాడు. ఇక థ‌మ‌న్ బావ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు అని అన్నాడు.

ఇక తాను సినిమాలో రానాని చూడలేదు. డానియల్ శేఖర్ ని మాత్రమే చూశాను అని హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా భీమ్లా నాయక్‌పై రివ్యూ ఇచ్చాడు. ఈ రివ్యూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

Share post:

Popular